Telugu Global
NEWS

ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్న గంటా....

మంత్రి గంటా శ్రీనివాస్‌ సీటుకు ఎసరొచ్చింది. రాష్ట్రంలో అత్యంత సురక్షితమైన స్థానం నుంచి తన కుమారుడు నారా లోకేష్‌ను బరిలో దింపాలని భావిస్తున్న చంద్రబాబు… గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి సీటుపై కన్నేశారు. పైకి లోకేష్ పోటీ చేస్తానంటే భీమిలి సీటు త్యాగం చేసేందుకు సిద్ధమని గంటా చెబుతూ వచ్చారు. కానీ లోపల భీమిలి నుంచి తానే పోటీ చేస్తానని పార్టీ పెద్దలకు చెబుతూ వచ్చారు. చంద్రబాబునాయుడు శుక్రవారం గంటాను పిలిపించుకుని భీమిలి సీటు నారా లోకేష్‌కు కేటాయిస్తున్నట్టు చెప్పారు. మీరు కావాలంటే విశాఖ ఎంపీ […]

ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్న గంటా....
X

మంత్రి గంటా శ్రీనివాస్‌ సీటుకు ఎసరొచ్చింది. రాష్ట్రంలో అత్యంత సురక్షితమైన స్థానం నుంచి తన కుమారుడు నారా లోకేష్‌ను బరిలో దింపాలని భావిస్తున్న చంద్రబాబు… గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి సీటుపై కన్నేశారు. పైకి లోకేష్ పోటీ చేస్తానంటే భీమిలి సీటు త్యాగం చేసేందుకు సిద్ధమని గంటా చెబుతూ వచ్చారు. కానీ లోపల భీమిలి నుంచి తానే పోటీ చేస్తానని పార్టీ పెద్దలకు చెబుతూ వచ్చారు.

చంద్రబాబునాయుడు శుక్రవారం గంటాను పిలిపించుకుని భీమిలి సీటు నారా లోకేష్‌కు కేటాయిస్తున్నట్టు చెప్పారు. మీరు కావాలంటే విశాఖ ఎంపీ లేదా విశాఖ నార్త్ , గాజువాక, చోడవరం నుంచి పోటీ చేయండి అని సూచించారు. ఇలా తన సీటుకు ఎసరుపెట్టడంతో గంటా నొచ్చుకున్నారు.

సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. శనివారం ఉదయం మరోసారి రావాల్సిందిగా గంటాకు చంద్రబాబు సూచించారు. కానీ శనివారం సమావేశానికి గంటా శ్రీనివాసరావు హాజరుకాలేదు. ఫోన్ స్విచ్‌ ఆఫ్ చేసుకున్నారు. ముఖ్యులు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు.

అదే సమయంలో నారా లోకేష్ భీమిలి నుంచి పోటీకి సిద్ధమవడంతో … బాలకృష్ణ చిన్నల్లుడు భరత్‌ ఆశలపైనా నీళ్లు చల్లినట్టు అయింది. భరత్ విశాఖ ఎంపీగా పోటీ చేయాలనుకున్నారు. కానీ ఇద్దరు అల్లుళ్లు ఒకే జిల్లాలో పోటీ చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఉద్దేశంతో బాలకృష్ణ చిన్నల్లుడికి సీటు లేనట్టేనని చెబుతున్నారు.

First Published:  10 March 2019 2:54 AM IST
Next Story