తలసానితో మాట్లాడండి: బంధువులకు బాబు ఆదేశం!
తన రాజకీయ అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేనినైనా వాడుకుంటారని రాజకీయ పార్టీల్లో ప్రచారం ఉంది. తనకు ఏ ఇబ్బందులు వచ్చినా…. దాన్నించి బయట పడేందుకు ఎవరినైనా ఉపయోగించుకోవడంలో చంద్రబాబునాయుడు సిద్ధహస్తుడని తెలుగుదేశం పార్టీకి చెందిన వారే కాదు దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీల నాయకులకు అనుభవ పూర్వకం. గడచిన మూడు దశాబ్దాలలో చంద్రబాబు నాయుడు అనేక మందిని ఎలా వాడుకుని వదిలేశాడో…. అనేక మంది తారీఖులతో సహా చెబుతారని […]
తన రాజకీయ అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేనినైనా వాడుకుంటారని రాజకీయ పార్టీల్లో ప్రచారం ఉంది. తనకు ఏ ఇబ్బందులు వచ్చినా…. దాన్నించి బయట పడేందుకు ఎవరినైనా ఉపయోగించుకోవడంలో చంద్రబాబునాయుడు సిద్ధహస్తుడని తెలుగుదేశం పార్టీకి చెందిన వారే కాదు దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీల నాయకులకు అనుభవ పూర్వకం.
గడచిన మూడు దశాబ్దాలలో చంద్రబాబు నాయుడు అనేక మందిని ఎలా వాడుకుని వదిలేశాడో…. అనేక మంది తారీఖులతో సహా చెబుతారని దేశ రాజకీయాలలో ప్రచారం. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు అదే అస్త్రాన్ని తిరిగి ప్రయోగించాలని అనుకుంటున్నారు నారా చంద్రబాబు. ఇందుకోసం ఆయన బంధువులనే పణంగా పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.
కొన్ని రోజులుగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ పైనా… ముఖ్యంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైనా నిప్పులు చెరుగుతున్నారు. ప్రతి రోజూ విలేకరుల సమావేశం పెట్టి చంద్రబాబు నాయుడు పై విమర్శలు గుప్పిస్తున్నారు. “చంద్రబాబు నాయుడు పని అయిపోయింది. ఇక ఆయన రిటైర్మెంట్ తీసుకోవచ్చు” అని కూడా సూచించారు తలసాని శ్రీనివాస్ యాదవ్.
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కు ఆంధ్రప్రదేశ్ లో అనేక మంది బంధువులు ఉన్నారు. వారిలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్ కూడా ఉన్నారు. ఆయన తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వయానా వియ్యంకుడు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు కూడా పుట్టాకు మరో వియ్యంకుడు.
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కట్టడి చేసేందుకు ఆయనకు వియ్యంకుడైన పుట్టా సుధాకర్ యాదవ్, యనమల రామకృష్ణుడులను వాడుకోవాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లు తెలుగుదేశం పార్టీ పెద్దలు చెబుతున్నారు. రోజురోజుకు తనపై విమర్శలు ఎక్కువవుతున్న తరుణంలో యనమల రామకృష్ణుడు, పుట్టాలతో మాట్లాడిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు “తలసాని చాలా జోరుగా ఉన్నారు. బంధుత్వాలను ఉపయోగించి ఆయనను కట్టడి చేయండి. ఇది వ్యక్తిగతంగా మీకు, సంస్థాగతంగా పార్టీకి మేలు చేస్తుంది” అని చెప్పినట్లు సమాచారం.
రానున్న ఎన్నికల్లో కడప జిల్లా నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ కు ఎమ్మెల్యే టికెట్ ఖరారు చేశారు చంద్రబాబు. తలసానితో మాట్లాడి ఆయనను కట్టడి చేస్తే అధికారంలోకి రాగానే మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని పుట్టా సుధాకర్ యాదవ్ కు ఎర వేసినట్లుగా చెబుతున్నారు.
గతంలో లోక్ సభ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు చివరి నిమిషం వరకు ఎలాంటి ఎత్తులు, వ్యూహాలు రూపొందించేందుకైనా ప్రయత్నిస్తారు అని చెప్పారు. ఈ కొత్త బంధుత్వ ఎత్తు కూడా అందులో భాగమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.