Telugu Global
NEWS

చంద్రబాబుకు షాకిచ్చిన ఎలక్షన్ కమిషన్..!

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్న రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. 2014 అసెంబ్లీ ఎన్నికలను తుది దశలో నిర్వహించగా.. ఈ దఫా తొలి విడతలోనే ఏపీ శాసన సభ ఎన్నికలు నిర్వహించడానికి ఈసీ షెడ్యూల్ విడుదల చేయడం ఒకింత షాక్‌కు గురిచేసింది. గత ఎన్నికల్లో అనూహ్య రీతిలో అధికారాన్ని చేపట్టిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. ఈ సారి ఎన్నికల్లో ఎదురీదుతున్నారు. రాష్ట్రంలో చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత ఉండగా.. అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ […]

చంద్రబాబుకు షాకిచ్చిన ఎలక్షన్ కమిషన్..!
X

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్న రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. 2014 అసెంబ్లీ ఎన్నికలను తుది దశలో నిర్వహించగా.. ఈ దఫా తొలి విడతలోనే ఏపీ శాసన సభ ఎన్నికలు నిర్వహించడానికి ఈసీ షెడ్యూల్ విడుదల చేయడం ఒకింత షాక్‌కు గురిచేసింది.

గత ఎన్నికల్లో అనూహ్య రీతిలో అధికారాన్ని చేపట్టిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. ఈ సారి ఎన్నికల్లో ఎదురీదుతున్నారు. రాష్ట్రంలో చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత ఉండగా.. అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ సమీక్షలు నిర్వహిస్తూ టికెట్లు పంపిణీ చేయడం పార్టీలోనే లుకలుకలు సృష్టిస్తోంది.

మరోవైపు ప్రతిపక్ష వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించకపోయినా ఇప్పటికే అధినేత జగన్ వద్ద పూర్తి స్థాయి లిస్ట్ తయారుగా ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. వలసలు ఆహ్వానిస్తున్నా.. ఆయా నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థిని కన్ఫార్మ్ చేసి అనధికారికంగా వారికి సమాచారం అందించినట్లు తెలుస్తోంది.

ఏపీలో పోలింగ్‌కు మరో 30 రోజులే గడువు ఉండటంతో వైసీపీ, టీడీపీ పూర్తి స్థాయిలో రంగంలోనికి దిగాల్సిన పరిస్థితి నెలకొంది.

గతంలో మాదిరిగానే తుది విడతలో ఏపీ ఎన్నికలు ఉంటాయని భావించిన చంద్రబాబుకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చిందనే చెప్పవచ్చు.

First Published:  10 March 2019 1:23 PM IST
Next Story