బాబు గురించి తెలిసి... తట్టా... “బుట్టా” సర్దుకుంటున్నారు!
వారు అధికారం కోసం నమ్మకాన్ని వదులుకున్నారు. పదవుల కోసం ప్రేమని పణంగా పెట్టారు. అధికారంలో ఉన్న పార్టీకి చేరువ అయితే ఎంతో ఎదుగుదల ఉంటుందని ఆశించి భంగపడ్డారు. అయితే అక్కడ ఉన్నది రాజకీయ చాణక్యాన్ని …. నమ్మిన వారిని వాడుకుని వదిలేయడానికి విశేష అనుభవం ఉన్న నాయకుడు అని తెలుసుకోలేక పోయారు. ఇదిగో ఇప్పుడు మళ్లీ సొంత పార్టీ బాట పడుతున్నారు. వీరిలో కర్నూలు లోక్ సభ స్థానానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి […]
వారు అధికారం కోసం నమ్మకాన్ని వదులుకున్నారు. పదవుల కోసం ప్రేమని పణంగా పెట్టారు. అధికారంలో ఉన్న పార్టీకి చేరువ అయితే ఎంతో ఎదుగుదల ఉంటుందని ఆశించి భంగపడ్డారు.
అయితే అక్కడ ఉన్నది రాజకీయ చాణక్యాన్ని …. నమ్మిన వారిని వాడుకుని వదిలేయడానికి విశేష అనుభవం ఉన్న నాయకుడు అని తెలుసుకోలేక పోయారు. ఇదిగో ఇప్పుడు మళ్లీ సొంత పార్టీ బాట పడుతున్నారు. వీరిలో కర్నూలు లోక్ సభ స్థానానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందిన బుట్టా రేణుక ఒకరు.
రాజకీయాలకు పూర్తిగా కొత్త అయినా ఆమెను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ చేరదీసి టిక్కెట్ ఇచ్చి గెలిపించారు. గెలిచి ఏడాదిన్నర కాకుండానే తెలుగుదేశం పార్టీ పంచకు చేరారు బుట్టా రేణుక. మూడు సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీలో ఉన్న బుట్టా రేణుక ఎన్నికల ముందు బొక్క బోర్లా పడే పరిస్థితి వచ్చింది.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్న చంద్రబాబు నాయుడు ఈసారి సిట్టింగ్ ఎంపీ బుట్టా రేణుకకు కాకుండా కోట్లకే టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. పోనీ ఎమ్మెల్యేగా పోటీ చేద్దామనుకున్నా కర్నూలు జిల్లాలో ఏ స్థానమూ ఖాళీగా లేదు. తనకు తెలియకుండానే తెలుగుదేశం పార్టీ అధినేత కొట్టిన దెబ్బకు బుట్టా రేణుక… తట్టా బుట్టా సర్దుకుని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరాలనుకుంటున్నారట.
ఇంచుమించు ఇలాంటి పరిస్థితే విశాఖపట్నం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు దాడి వీరభద్రరావుది. గత ఎన్నికలలో అనకాపల్లి శాసనసభ స్థానం నుంచి దాడి వీరభద్రరావు కుమారుడు రత్నాకర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికలలో ఆయన ఓటమి పాలయ్యారు. నాలుగైదు సంవత్సరాలుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు తొంగి చూడని దాడి వీరభద్రరావు సరిగ్గా ఎన్నికలకు ముందు మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఇదే కోవలోకి మరో సీనియర్ నాయకుడు రఘురామ కృష్ణంరాజు కూడా చేరారు. ముందుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన రఘురామకృష్ణంరాజు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. అక్కడ అవమానాన్ని భరించలేక తిరిగి సొంత గూటికి వస్తున్నట్లుగా ప్రకటించారు.
పార్టీ వీడి అధికార పార్టీలో చేరిన ప్రజాప్రతినిధులు, నాయకులు తెలుగుదేశం పార్టీలో ఇమడలేక…. ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదంటూ తిరిగి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైయస్ జగన్ పట్ల గౌరవం పెరుగుతుంది అనడానికి నిదర్శనం అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.