ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు 30 రోజులే గడువు..!
మరో నెల రోజుల్లో ఏపీ అసెంబ్లీకి.. ఏపీ, తెలంగాణలోని పార్లమెంటు సీట్లకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇవాళ కేంద్ర ఎన్నికల కమిషనర్ సునిల్ అరోరా షెడ్యూల్ విడుదల చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి విడతలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏపీ అసెంబ్లీకి మార్చి 18న నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చి 26న నామినేషన్ల పరిశీలన జరుగనుంది. ఇక మార్చి 28న నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు. ఏప్రిల్ 11న పోలింగ్ నిర్వహించి మే 23న ఫలితాలు వెల్లడించనున్నారు. కేవలం […]
మరో నెల రోజుల్లో ఏపీ అసెంబ్లీకి.. ఏపీ, తెలంగాణలోని పార్లమెంటు సీట్లకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇవాళ కేంద్ర ఎన్నికల కమిషనర్ సునిల్ అరోరా షెడ్యూల్ విడుదల చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి విడతలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఏపీ అసెంబ్లీకి మార్చి 18న నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చి 26న నామినేషన్ల పరిశీలన జరుగనుంది. ఇక మార్చి 28న నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు. ఏప్రిల్ 11న పోలింగ్ నిర్వహించి మే 23న ఫలితాలు వెల్లడించనున్నారు.
కేవలం 30 రోజుల వ్యవధిలో ఎన్నికలు నిర్వహించనుండటంతో ఏపీ రాజకీయ వర్గాల్లో కలకలం రేగుతోంది. ఇప్పటికీ అభ్యర్థుల ఖరారు, మేనిఫెస్టో రూపకల్పన పూర్తి స్థాయిలో జరుగలేదు. ఈ నేపథ్యంలో ఏపీలోని ప్రధాన పార్టీలకు ఈ 30 రోజులు అత్యంత కీలకంగా మారనున్నాయి.