రేవంత్ కొత్త పార్టీ ? కాంగ్రెస్‌లో కొత్త ప్రచారం !
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ శంషాబాద్ సభకు హాజరు కాలేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ఈ సభకు ఎందుకు హాజరు కాలేదు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత కొంత కాలంగా ఆయన కాంగ్రెస్ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. గత ఎన్నికల ఫలితాలతో డైలామా లో పడిన రేవంత్‌రెడ్డి కొత్త పార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన కాంగ్రెస్ […]
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ శంషాబాద్ సభకు హాజరు కాలేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ఈ సభకు ఎందుకు హాజరు కాలేదు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత కొంత కాలంగా ఆయన కాంగ్రెస్ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. కార్యక్రమాలకు హాజరు కావడం లేదు.
గత ఎన్నికల ఫలితాలతో డైలామా లో పడిన రేవంత్‌రెడ్డి కొత్త పార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది.
టీడీపీ అధినేత చంద్రబాబు సలహానో తెలియదు…. లేదా సన్నిహితులు ఇచ్చిన సమాచారమో తెలియదు…. కానీ రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెట్టడం ఖాయమని తెలుస్తోంది.
ఎంపీ ఎన్నికలు ముగిసిన తర్వాత రేవంత్ ఏం చేయబోతున్నారనేది క్లారిటీ వస్తుందని అనుచరులు చెబుతున్నారు. మరోవైపు కొందరు నేతలు మాత్రం ఎంపీ ఎన్నికల్లోనే కొత్త పార్టీ పెడతారని అంటున్నారు.
మొత్తానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయమని మాత్రం తెలుస్తోంది.