మోడీ.. మళ్లీ అక్కడి నుంచే పోటీ..!
సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గత ఎన్నికల్లో వడోదర, వారణాసి పార్లమెంటు స్థానాల నుంచి పోటీ చేసి రెండిటిలోనూ భారీ మెజార్టీతో గెలుపొందారు. పీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వడోదర స్థానాన్ని వదులు కొని వారణాసి నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. కాగా, ఈ దఫా ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై బీజేపీ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. యూపీలోని వారణాసి […]
సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గత ఎన్నికల్లో వడోదర, వారణాసి పార్లమెంటు స్థానాల నుంచి పోటీ చేసి రెండిటిలోనూ భారీ మెజార్టీతో గెలుపొందారు. పీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వడోదర స్థానాన్ని వదులు కొని వారణాసి నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు.
కాగా, ఈ దఫా ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై బీజేపీ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. యూపీలోని వారణాసి నుంచే ప్రధాని మోడీ ఎంపీగా పోటీ చేస్తారని బీజేపీ ప్రకటించింది. ఇవాళ ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో భేటీ అయిన ఎన్నికల వ్యూహాల కమిటీ.. మోడీ ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపైనే చర్చించారు. మోడీ సహా.. అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షాలతో కూడిన ఈ కమిటీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
బీజేపీకి ఉత్తరప్రదేశ్ చాలా కీలకం. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచే అత్యధిక సీట్లు గెలుచుకుంది. మోడీ గనుక ఈ రాష్ట్రం నుంచే పోటీ చేస్తే కార్యకర్తల్లో ఉత్సాహం నింపవచ్చని.. తద్వారా గత ఫలితాలనే పునరావృతం చేయవచ్చని బీజేపీ భావిస్తోంది.