Telugu Global
NEWS

వైసీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యే

టీడీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మరో ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీలో చేరారు. ఇటీవలే ఆయన టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. లోటస్‌పాండ్‌లో వైఎస్ జగన్‌ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. గత ఎన్నికల్లో గుంటూరు నుంచి మోదుగుల గెలిచారు. 2009లో ఆయన నరసరావుపేట నుంచి ఎంపీగా గెలిచారు. అయితే కాంగ్రెస్‌ నుంచి టీడీపీలోకి వచ్చిన రాయపాటి కోసం మోదుగులకు చంద్రబాబు ఎంపీ టికెట్ నిరాకరించారు. ఎమ్మెల్యేగా మోదుగులను బరిలో దింపారు. పార్టీ అధికారంలోకి […]

వైసీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యే
X

టీడీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మరో ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీలో చేరారు. ఇటీవలే ఆయన టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

లోటస్‌పాండ్‌లో వైఎస్ జగన్‌ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. గత ఎన్నికల్లో గుంటూరు నుంచి మోదుగుల గెలిచారు. 2009లో ఆయన నరసరావుపేట నుంచి ఎంపీగా గెలిచారు. అయితే కాంగ్రెస్‌ నుంచి టీడీపీలోకి వచ్చిన రాయపాటి కోసం మోదుగులకు చంద్రబాబు ఎంపీ టికెట్ నిరాకరించారు.

ఎమ్మెల్యేగా మోదుగులను బరిలో దింపారు. పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ మంత్రి పదవి ఇవ్వలేదు. పైగా ఆయన్ను పార్టీ నుంచి బయటకు పంపేందుకు గల్లా జయదేవ్, పత్తిపాటి పుల్లారావు పావులు కదుపుతూ వచ్చారు. ఈనేపథ్యంలో ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరారు.

First Published:  9 March 2019 6:35 AM IST
Next Story