గుడివాడలో పిల్లోడు తట్టుకుంటాడా?
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వరుసగా టికెట్లు ఖరారు చేస్తున్నారు. చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పటికే పలువురు అభ్యర్థులు రంగంలోకి దిగారు. గుడివాడ అభ్యర్థిని కూడా చంద్రబాబు ఖరారు చేశారు. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎన్టీఆర్ సొంత నియోజకవర్గంలోనే టీడీపీ ఓడిపోతుండడం టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా అక్కడ నానికి చెక్ పెట్టాలని భావించారు. పలువురు అభ్యర్థుల పేర్లను పరిశీలించిన చంద్రబాబు చివరకు దేవినేని అవినాష్ పేరును ఖరారు […]

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వరుసగా టికెట్లు ఖరారు చేస్తున్నారు. చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పటికే పలువురు అభ్యర్థులు రంగంలోకి దిగారు. గుడివాడ అభ్యర్థిని కూడా చంద్రబాబు ఖరారు చేశారు.
ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎన్టీఆర్ సొంత నియోజకవర్గంలోనే టీడీపీ ఓడిపోతుండడం టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా అక్కడ నానికి చెక్ పెట్టాలని భావించారు.
పలువురు అభ్యర్థుల పేర్లను పరిశీలించిన చంద్రబాబు చివరకు దేవినేని అవినాష్ పేరును ఖరారు చేశారు. వచ్చే ఎన్నికల్లో కొడాలి నానిపై అవినాష్ పోటీ చేస్తారని చంద్రబాబు ఖాయం చేశారు.
అయితే కొడాలి నాని దూకుడుకు అవినాష్ తట్టుకుంటారా? అన్న అనుమానాన్ని టీడీపీ నేతలే వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ తీరా ఎన్నికల సమయంలో నియోజకవర్గానికి అవినాష్ వస్తే … నానికి తట్టుకునేందుకు అవసరమైన శక్తిసామర్ధ్యాలు, బలాన్ని సమీకరించుకోవడం ఈజీ కాదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.