Telugu Global
Cinema & Entertainment

కేజీఎఫ్ చాప్టర్-2 వస్తోంది

కన్నడ సినిమా కేజీఎఫ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను కన్నడ బాహుబలి అని ముద్దుగా పిలుచుకుంటారు అక్కడి ప్రేక్షకులు. అంత పెద్ద హిట్ ఇది. ఇంకా చెప్పాలంటే కన్నడ చిత్రసీమలో ప్రస్తుతానికి అతిపెద్ద హిట్ ఇదే. అలాంటి సినిమాకు సీక్వెల్ రాబోతోంది. కేజీఎఫ్ చాప్టర్-2 సెట్స్ పైకి వెళ్లేందుకు రంగం సిద్ధం అవుతోంది. కేజీఎఫ్ సినిమాను విడుదల చేసినప్పుడే దాన్ని చాప్టర్-1గా పరిచయం చేశారు. మొదటి భాగంలో ఓ చిన్న కుర్రాడు, […]

కేజీఎఫ్ చాప్టర్-2 వస్తోంది
X

కన్నడ సినిమా కేజీఎఫ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను కన్నడ బాహుబలి అని ముద్దుగా పిలుచుకుంటారు అక్కడి ప్రేక్షకులు. అంత పెద్ద హిట్ ఇది. ఇంకా చెప్పాలంటే కన్నడ చిత్రసీమలో ప్రస్తుతానికి అతిపెద్ద హిట్ ఇదే. అలాంటి సినిమాకు సీక్వెల్ రాబోతోంది. కేజీఎఫ్ చాప్టర్-2 సెట్స్ పైకి వెళ్లేందుకు రంగం సిద్ధం అవుతోంది.

కేజీఎఫ్ సినిమాను విడుదల చేసినప్పుడే దాన్ని చాప్టర్-1గా పరిచయం చేశారు. మొదటి భాగంలో ఓ చిన్న కుర్రాడు, ఎలా మాఫియాలో చేరాడు.. ఓ గనికి ఎలా అధిపతి అయ్యాడనే విషయాల్ని చూపించారు. రెండో భాగంలో బంగారు గని దక్కించుకున్న హీరో ఏం చేశాడు.. ఆ స్థానం కోసం పోటీపడుతున్న శత్రువుల నుంచి ఎలా తప్పించుకున్నాడనే విషయాల్ని చూపించబోతున్నారు.

అన్నీ అనుకున్నట్టు జరిగితే యష్ హీరోగా వచ్చే నెల మూడో వారం నుంచి కేజీఎఫ్ చాప్టర్-2 సెట్స్ పైకి వస్తుంది. ఈ సినిమా నార్త్ ఇండియాలో కూడా సూపర్ హిట్ అయింది. అందుకే చాప్టప్-2 కోసం బాలీవుడ్ నటీనటుల్ని కూడా తీసుకుంటున్నారు. అంతేకాదు, బడ్జెట్ ను కూడా డబుల్ చేశారు.

First Published:  9 March 2019 4:27 AM IST
Next Story