ఆయన ప్రెస్‌మీట్ కోసమే ఏపీ, తెలంగాణ వెయిటింగ్ !
డేటా చోరీ కేసులో రోజురోజుకు కొత్త కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. కొత్త కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఐటీ గ్రిడ్ కేసుతో టీడీపీ మొత్తం డిఫెన్స్‌లో పడింది. దీంతో తటస్తులుగా ముద్ర పడిన కొందరు టీడీపీ సానుభూతిపరులు ఇప్పుడు తమ రంగు బయటపెడుతున్నారు. హీరో శివాజీ చౌదరితో పాటు తెలుగుదేశం అనుకూల మీడియాలో సైబర్ నిపుణుడిగా ప్రచారం పొందిన నల్లమోతు శ్రీధర్ చౌదరి కూడా ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా మాట్లాడడం మొదలుపెట్టారు. మరోవైపు తెలుగుదేశం పూర్తిగా […]
డేటా చోరీ కేసులో రోజురోజుకు కొత్త కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. కొత్త కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఐటీ గ్రిడ్ కేసుతో టీడీపీ మొత్తం డిఫెన్స్‌లో పడింది. దీంతో తటస్తులుగా ముద్ర పడిన కొందరు టీడీపీ సానుభూతిపరులు ఇప్పుడు తమ రంగు బయటపెడుతున్నారు.
హీరో శివాజీ చౌదరితో పాటు తెలుగుదేశం అనుకూల మీడియాలో సైబర్ నిపుణుడిగా ప్రచారం పొందిన నల్లమోతు శ్రీధర్ చౌదరి కూడా ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా మాట్లాడడం మొదలుపెట్టారు.
మరోవైపు తెలుగుదేశం పూర్తిగా ఈ వ్యవహారంలో కూరుకుపోయింది. అందరూ ప్రెస్‌మీట్లు పెట్టారు. ఏవో ఏవో అంశాలను తెరపైకి తెచ్చారు. ఎదురు దాడి చేశారు. కానీ ఇంతవరకూ వర్క్‌వుట్ కాలేదు. ఈ వ్యవహారంలో ఏపీ ఐటీ శాఖ మంత్రి, టీడీపీ టెక్నాలజీ బ్రాండ్ అంబాసిడర్ లోకేష్ మాత్రం ఇంతవరకూ మీడియా ముందుకు రాలేదు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కేవలం ఎవరో రాసిచ్చే స్క్రిప్ట్ ను ట్వీట్ చేస్తూ దాన్నే ప్రచారం చేస్తున్నారు.
ఏపీ ఐటీ శాఖ మంత్రిగా, టీడీపీలో సభ్యత్వాలను పర్యవేక్షించిన నేతగా లోకేష్ డేటా చోరీపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆయన మీడియా ముందుకు వచ్చి దీంట్లో జరిగిన విషయాలను చెప్పాల్సి ఉంది. డేటా చోరీ అయిందా? లేదా? టీడీపీ ఎలాంటి సమాచారం సేకరించింది? అనే విషయాలు ఆయనకే తెలుసు. అందుకే ఇప్పుడు ఆయన ఈ విషయంలో ముందుకు వస్తే క్లారిటీ వస్తుందనే అభిప్రాయం ఉంది.
మరోవైపు ఈ కేసులో ఏ1 అశోక్. ఆయన పరారీలో ఉన్నారు. అశోక్ లోకేష్‌కు సన్నిహితుడు. కాబట్టి ఈ అంశంలో ప్రజలకు క్లారిటీ రావాలి అంటే లోకేష్ ముందుకు వచ్చి అన్ని అంశాలను వివరిస్తే బాగుంటుందని తెలుగు తమ్ముళ్లు కూడా అంటున్నారు. ఆయన ప్రెస్‌మీట్ కోసమే ఏపీ,తెలంగాణ వెయిటింగ్ చేస్తుందని చెబుతున్నారు.