Telugu Global
NEWS

క్లారిటీ ఇచ్చిన శైలజానాథ్

మాజీ మంత్రి శైలజానాథ్‌ వచ్చే ఎన్నికల్లో తను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్న దానిపై క్లారిటీ ఇచ్చారు. ఆయన టీడీపీలో చేరుతారని ప్రచారం జరిగింది. అయితే తాను పార్టీ మారడం లేదని శైలజానాథ్‌ స్పష్టం చేశారు. తన అనుచరులతో సమావేశం అయిన శైలజానాథ్‌… తాను వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపునే పోటీ చేస్తానని ప్రకటించారు. తనపై ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా దేశ స్థాయిలో తనకు గుర్తింపును తెచ్చిన కాంగ్రెస్‌ను వీడి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. తాను […]

క్లారిటీ ఇచ్చిన శైలజానాథ్
X

మాజీ మంత్రి శైలజానాథ్‌ వచ్చే ఎన్నికల్లో తను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్న దానిపై క్లారిటీ ఇచ్చారు. ఆయన టీడీపీలో చేరుతారని ప్రచారం జరిగింది.

అయితే తాను పార్టీ మారడం లేదని శైలజానాథ్‌ స్పష్టం చేశారు. తన అనుచరులతో సమావేశం అయిన శైలజానాథ్‌… తాను వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపునే పోటీ చేస్తానని ప్రకటించారు.

తనపై ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా దేశ స్థాయిలో తనకు గుర్తింపును తెచ్చిన కాంగ్రెస్‌ను వీడి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి ఓట్లు అడుగుతానని… గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని శైలజానాథ్‌ అనుచరులకు వివరించారు.

ఇక్కడ వైసీపీ నుంచి జొన్నలగడ్డ పద్మావతి పోటీ చేసే అవకాశం ఉంది. టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే యామిని బాలకు ఈసారి టికెట్ కష్టమంటున్నారు. మరో మహిళా అభ్యర్థి పేరును చంద్రబాబు పరిశీలిస్తున్నారు.

First Published:  9 March 2019 6:38 AM IST
Next Story