Telugu Global
NEWS

ఆమంచిపై సోషల్ మీడియాలో కొత్త ప్రచారం

ఇటీవలే టీడీపీ నుంచి వైసీపీలో చేరిన చీరాల ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యే ఆమంచిపై ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతోంది అంటూ కొందరు ప్రచారం మొదలుపెట్టారు. ఆమంచి అంటే గిట్టని వాళ్లు కొత్త ప్రచారం మొదలుపెట్టారు. ఇటీవల వైసీపీ సర్వే చేయించిందని… అందులో ఆమంచిపై 77 శాతం ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్టు తేలింది అంటూ ప్రచారం మొదలుపెట్టింది వైరి వర్గం. ఇందు కోసం ఒక ప్రముఖ టీవీ చానల్‌ లోగోలను వాడేసి… అచ్చం ఆ చానల్‌లోనే ఈ కథనం వచ్చినట్టు మార్ఫింగ్ […]

ఆమంచిపై సోషల్ మీడియాలో కొత్త ప్రచారం
X

ఇటీవలే టీడీపీ నుంచి వైసీపీలో చేరిన చీరాల ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యే ఆమంచిపై ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతోంది అంటూ కొందరు ప్రచారం మొదలుపెట్టారు. ఆమంచి అంటే గిట్టని వాళ్లు కొత్త ప్రచారం మొదలుపెట్టారు.

ఇటీవల వైసీపీ సర్వే చేయించిందని… అందులో ఆమంచిపై 77 శాతం ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్టు తేలింది అంటూ ప్రచారం మొదలుపెట్టింది వైరి వర్గం. ఇందు కోసం ఒక ప్రముఖ టీవీ చానల్‌ లోగోలను వాడేసి… అచ్చం ఆ చానల్‌లోనే ఈ కథనం వచ్చినట్టు మార్ఫింగ్ చేసి కొన్ని ఇమేజ్‌లను వాట్సాప్‌ గ్రూపుల్లో, ఇతర సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయిస్తోంది.

దీనిపై ఆరా తీయగా తెలిసిందేమిటంటే… ఆమంచి పార్టీలో చేరిన తర్వాత ఎలాంటి సర్వే చేయలేదు. అసలు ఆమంచిపై 77 శాతం ప్రజా వ్యతిరేకత ఉందని సర్వేలో తేలినట్టు… ఏ చానల్‌లో వచ్చిందని నమ్మించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారో… అసలు సదరు చానల్‌లో ఈ కథనమే రాలేదు.

కేవలం గ్రాఫిక్స్‌, ఫోటో షాప్ సాయంలో చానల్‌ లోగోలను వాడేసి.. టీడీపీని వదిలేసిన తర్వాత ఆమంచిపై ప్రజావ్యతిరేకత వెల్లువెత్తుతోందని నమ్మించేందుకే ఈ తరహా ప్రచారం చేస్తున్నారన్నది సుస్పష్టం. ఇంతకాలం ఆయన్ను ప్రజలు ఆదరించింది టీడీపీని చూసే గానీ… ఆయన సొంత పనితీరును చూసి కాదు అని నమ్మించడం ఈ ప్రచారం ఉద్దేశం.

First Published:  9 March 2019 8:45 AM GMT
Next Story