జమ్మూలో గ్రెనేడ్ దాడి చేసింది ఒక 9వ తరగతి విద్యార్థి..!
జమ్మూ పట్టణంలో మత సామరస్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా బస్టాండులో నిలిచి ఉన్న బస్సులో గ్రెనేడ్ దాడి జరిగిందని జమ్మూ ఐజీ ఎంకే సిన్హా మీడియాకు వెల్లడించాడు. ఒక 9వ తరగతి విద్యార్థి ఈ దాడి చేసినట్లు తమ దర్యాప్తులో తెలిసిందని ఆయన స్పష్టం చేశారు. గురువారం ఉదయం జమ్మూలోని బస్టాండ్‌లో జరిగిన గ్రెనేడ్ దాడిలో ఇద్దరు మృతి చెందగా.. 32 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. దాడి జరిగిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని దక్షిణ […]
జమ్మూ పట్టణంలో మత సామరస్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా బస్టాండులో నిలిచి ఉన్న బస్సులో గ్రెనేడ్ దాడి జరిగిందని జమ్మూ ఐజీ ఎంకే సిన్హా మీడియాకు వెల్లడించాడు. ఒక 9వ తరగతి విద్యార్థి ఈ దాడి చేసినట్లు తమ దర్యాప్తులో తెలిసిందని ఆయన స్పష్టం చేశారు.
గురువారం ఉదయం జమ్మూలోని బస్టాండ్‌లో జరిగిన గ్రెనేడ్ దాడిలో ఇద్దరు మృతి చెందగా.. 32 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. దాడి జరిగిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్‌లోని ఒక చెక్‌పోస్టు వద్ద అదుపులోనికి తీసుకున్నాయి. 9వ తరగతి చదువుతున్న ఈ మైనర్ యూట్యూబ్ సహాయంతో గ్రెనేడ్ తయారు చేశాడని.. దాన్ని లంచ్ బాక్స్‌లో పెట్టుకొని 250 కిలోమీటర్లు ప్రయాణించి జమ్ములో దాడికి పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు.
అతను కారులో వచ్చాడని పోలీసులు చెబుతున్నా.. ఒక మైనర్ వన్‌వే ట్రాఫిక్, చెక్‌పోస్టులు కలిగిన జమ్ము నేషనల్ హైవేపై ఎలా ప్రయాణించాడనే దానిపై సందేహాలు రేకెత్తుతున్నాయి. బాలుడు జమ్ము రావడమే ఇదే తొలిసారి కావడంతో అతనికి ఎవరైనా సహాయం చేశారా అనే దానిపై కూడా చర్చ జరుగుతోంది.
ఇక పోలీసులు… హిజ్బుల్ సంస్థ కుల్గాం జిల్లా కమాండర్ ఫరూఖ్ అహ్మద్ భట్‌తో అతను మాట్లాడినట్లు తేలిందన్నారు. ఫరూక్ తనకు గ్రెనేడ్ అందజేస్తే.. తాను గురువారం జమ్ము వచ్చి దాడి చేశానని కూడా చెప్పినట్లు చెబుతున్నారు.