లగడపాటి కన్ను ఆ ఎంపీ సీటుపై పడిందట !
విజయవాడ మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ పొలిటికల్ రీ ఎంట్రీకి స్కెచ్ రెడీ అవుతోంది. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ కూటమికి సహకరించబోయి…సర్వేల పేరుతో బొక్క బొర్లా పడ్డ లగడపాటి…. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రాజకీయ రంగప్రవేశానికి అన్నీ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల తర్వాత లగడపాటి రాజగోపాల్ రాజకీయ సన్యాసం తీసుకున్నారు. నాలుగేళ్లుగా పొలిటికల్‌గా సైలెంట్‌గా ఉన్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు మాత్రం కొనసాగిస్తున్నారు. ఇటీవలే […]
విజయవాడ మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ పొలిటికల్ రీ ఎంట్రీకి స్కెచ్ రెడీ అవుతోంది. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ కూటమికి సహకరించబోయి…సర్వేల పేరుతో బొక్క బొర్లా పడ్డ లగడపాటి…. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రాజకీయ రంగప్రవేశానికి అన్నీ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.
2014 ఎన్నికల తర్వాత లగడపాటి రాజగోపాల్ రాజకీయ సన్యాసం తీసుకున్నారు. నాలుగేళ్లుగా పొలిటికల్‌గా సైలెంట్‌గా ఉన్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు మాత్రం కొనసాగిస్తున్నారు. ఇటీవలే టీడీపీ అనుకూల పత్రిక అధినేతతో కలిసి చంద్రబాబుతో సమావేశమయ్యారు. తెలంగాణ ఎన్నికల్లో సర్వే పేరుతో తాను తీసుకొచ్చిన మైలేజీకి ప్రతిఫలం కావాలని అడిగినట్లు ప్రచారం జరుగుతోంది.
టీడీపీలో ఓ క్యాంపు ఇప్పుడు లగడపాటిని నర్సరావుపేట నుంచి పోటీలో దింపాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. రాయపాటి రెండు రోజుల కిందట ఇక్కడి నుంచి పోటీకి రెడీ అన్నారు. ఈ నేపథ్యంలో లగడపాటి రాజగోపాల్ మంగళవారం గుంటూరు వచ్చారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావుతో రహస్యంగా భేటి అయ్యారు. చంద్రబాబు కోరితే నర్సరావుపేట ఎంపిగా పోటీ చేస్తానని చెప్పినట్టు తెలిసింది.
ఇక్కడి నుంచి పత్తిపాటి పుల్లారావు, జివి ఆంజనేయులు, కోడెల శివ ప్రసాదరావు, యరపతినేని శ్రీనివాసరావులను ఎంపిగా పోటీ చేయాలని కొద్దిరోజుల క్రితం చంద్రబాబు కోరారు. అయితే వారు తాము పోటీ చేయలేమని తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది.
లగడపాటి స్వస్థలమూ గుంటూరు కావడం వల్ల ఆయన్ను నరసరావు పేట నుంచి పోటీ చేయించడం మేలని పలువురు నాయకులు భావిస్తున్నట్టు తెలిస్తోంది. రాయపాటికి అవకాశం ఇవ్వకుంటే లగడపాటి పేరును సిఎం చంద్రబాబు పరిశీలిం చే అవకాశం ఉందని జిల్లా సీనియర్ నేత ఒకరు చెప్పారు.
మరోవైపు స్పీకర్ కోడెల కూడా నర్సరావుపేట ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. సత్తెనపల్లిలో పూర్తి వ్యతిరేకత ఉండడంతో ఆసీటు రాయపాటి కొడుకుకు వదిలేయాలని చూస్తున్నారట. మొత్తానికి మరో రెండు మూడు రోజుల్లో లగడపాటి పోటీపై క్లారిటీ వచ్చే అవకాశం కన్పిస్తోంది.