ఫేస్ బుక్ కు ఒకటిన్నర కోటిమంది యూజర్లు గుడ్ బై
ఫేస్ బుక్ తన ఉనికిని కోల్పోతుందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఎడిసన్ రీసర్చ్ అనే మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఫేస్ బుక్ గురించి అనేక సంచలన విషయాల్ని వెలుగులోకి తెచ్చింది. డేటా లీకేజీతో అష్టకష్టాలు పడుతున్న ఫేస్ బుక్ యూజర్లను కోల్పోతున్నట్లు తెలిపింది. యూఎస్ లో ఊహించనంతగా యూజర్లు ఫేస్ బుక్ కు దూరమవుతున్నారని స్పష్టం చేసింది. 2017 ఉన్న యూజర్లతో పోల్చితే… అమెరికాలో దాదాపు ఒకటిన్నర కోటి మంది యూజర్లు ఫేస్ బుక్ నుంచి […]
ఫేస్ బుక్ తన ఉనికిని కోల్పోతుందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఎడిసన్ రీసర్చ్ అనే మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఫేస్ బుక్ గురించి అనేక సంచలన విషయాల్ని వెలుగులోకి తెచ్చింది.
డేటా లీకేజీతో అష్టకష్టాలు పడుతున్న ఫేస్ బుక్ యూజర్లను కోల్పోతున్నట్లు తెలిపింది. యూఎస్ లో ఊహించనంతగా యూజర్లు ఫేస్ బుక్ కు దూరమవుతున్నారని స్పష్టం చేసింది. 2017 ఉన్న యూజర్లతో పోల్చితే… అమెరికాలో దాదాపు ఒకటిన్నర కోటి మంది యూజర్లు ఫేస్ బుక్ నుంచి వైదొలిగినట్లు ఆధారాలతో సహా వెలుగులోకి తెచ్చింది. వీరిలో ఎక్కువ మంది 12 నుంచి 34 ఏళ్ల మధ్యలో ఉన్నవారు.
దీనికి తోడు ఫేస్ బుక్ లో యాడ్స్ యూజర్లను ఇబ్బంది పెడుతున్నట్లు తెలుస్తోంది. ఓవైపు డేటా లీకేజీ మరోవైపు యాడ్స్ చికాకు పెట్టించడంతో ప్రత్యామ్నాయ మార్గంగా ఉన్న ఇన్ స్టా గ్రాం కు దగ్గరవుతున్నట్లు తెలుస్తోంది.
వ్యక్తిగత సమాచారాన్ని ఫేస్ బుక్ చోరీ చేస్తోందనే అసంతృప్తి కూడా ఫేస్ బుక్ యూజర్లలో బలంగా ఉంది. డేటా చోరీ అంశంలో ఫేస్ బుక్ ఇప్పటికే విచారణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వీటన్నింటి నేపథ్యంలో, ఫేస్ బుక్ కు భారీ ఎత్తున అమెరికన్లు గుడ్ బై చెబుతున్నారు.