ఏపీలో.... డబ్బు టు ది “ పవర్” ఆఫ్ డబ్బు!
ఆంధ్రప్రదేశ్ లో రానున్న శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో ధన ప్రవాహం అతిగా పారుతుందని ఎన్నికల సంఘం అంచనా వేసింది. 175 నియోజకవర్గాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో దాదాపు 135 నియోజకవర్గాల్లో డబ్బు ప్రభావం విపరీతంగా ఉంటుందని ఎన్నికల సంఘం చెబుతోంది. అధికారమే పరమావధిగా పనిచేస్తున్న పార్టీలు డబ్బును మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు పెట్టేందుకు వెనుకాడవని అభిప్రాయపడుతోంది. గత ఎన్నికలతో పోలిస్తే త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికలలో 135 నియోజక వర్గాలలోనూ దాదాపు నాలుగువేల కోట్ల రూపాయల […]
ఆంధ్రప్రదేశ్ లో రానున్న శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో ధన ప్రవాహం అతిగా పారుతుందని ఎన్నికల సంఘం అంచనా వేసింది. 175 నియోజకవర్గాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో దాదాపు 135 నియోజకవర్గాల్లో డబ్బు ప్రభావం విపరీతంగా ఉంటుందని ఎన్నికల సంఘం చెబుతోంది.
అధికారమే పరమావధిగా పనిచేస్తున్న పార్టీలు డబ్బును మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు పెట్టేందుకు వెనుకాడవని అభిప్రాయపడుతోంది. గత ఎన్నికలతో పోలిస్తే త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికలలో 135 నియోజక వర్గాలలోనూ దాదాపు నాలుగువేల కోట్ల రూపాయల వరకు ఖర్చుచేసేందుకు అభ్యర్థులు వెనుకాడటం లేదని ఓ ప్రైవేటు సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అధికారంలో ఉన్న పార్టీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ధన ప్రవాహమే సరైన మార్గమని భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
గత ఎన్నికలలో బొటాబొటి మెజారిటీతో గెలిచిన అధికార పార్టీ తెలుగుదేశం శాసనసభ్యులు ఈసారి తాము విజయం సాధించాలంటే అన్ని ఎత్తులు, వ్యూహాలు, ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ రూపాల్లో దగ్గరవ్వాలని ప్రయత్నాలు ప్రారంభించారు.
రాయలసీమ, కోస్తాంధ్ర, ఉభయగోదావరి, ఉత్తరాంధ్రలోని విశాఖ జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో డబ్బు ప్రభావం విపరీతంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికలలో 1000, 1500, రెండు వేల ఓట్ల కంటే తక్కువ మెజార్టీతో గెలుపొందిన “తమ్ముళ్లు” కొందరు ఈసారి తాము గెలవడం కష్టమని, విపరీతంగా డబ్బు ఖర్చు పెడితే తప్ప విజయం సాధించలేమని అభిప్రాయ పడుతున్నట్లు సమాచారం. దీంతో రానున్న ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో డబ్బే ప్రాధాన్యమని అంటున్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్ లోని తీర ప్రాంతాల్లో మద్యం ఏరులై పారుతుందని కూడా ఎన్నికల సంఘం భావిస్తోంది. డబ్బు, మద్యం ప్రభావాన్ని వీలున్నంత తగ్గించేందుకు ఎన్నికల సంఘం తన నిఘా వ్యవస్ధను మరింత పటిష్టం చేయాలనుకుంటోంది. అయితే దీని ప్రభావం మాత్రం ఎంత వరకూ ఉంటుందో చెప్పడం కష్టమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.