పరిపూర్ణ ను రుద్దకండి షా గారు: కమలనాథులు
తెలంగాణ పర్యటనకు వచ్చిన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు తెలంగాణ కమలనాథులు షాక్ ఇచ్చారు. ఈ పర్యటనలో భాగంగా తెలంగాణ నాయకులపై రుసరుసలు ఆడతారని, మండి పడతారని అందరూ భావించారు. అయితే, పార్టీ సీనియర్ నాయకులతో అమిత్ షా జరిపిన సమావేశంలో తెలంగాణలో పార్టీ పరిస్థితి పై తన అభిప్రాయం చెప్పడానికి అమిత్ షా సన్నద్ధమై తన అభిప్రాయాన్ని వెల్లడించేందుకు మైకు ముందుకు వచ్చారు. పార్టీలో సీనియర్లకు అందరికీ గౌరవ సూచకంగా నమస్కారాలు […]
తెలంగాణ పర్యటనకు వచ్చిన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు తెలంగాణ కమలనాథులు షాక్ ఇచ్చారు. ఈ పర్యటనలో భాగంగా తెలంగాణ నాయకులపై రుసరుసలు ఆడతారని, మండి పడతారని అందరూ భావించారు.
అయితే, పార్టీ సీనియర్ నాయకులతో అమిత్ షా జరిపిన సమావేశంలో తెలంగాణలో పార్టీ పరిస్థితి పై తన అభిప్రాయం చెప్పడానికి అమిత్ షా సన్నద్ధమై తన అభిప్రాయాన్ని వెల్లడించేందుకు మైకు ముందుకు వచ్చారు. పార్టీలో సీనియర్లకు అందరికీ గౌరవ సూచకంగా నమస్కారాలు చెప్పి తన ప్రసంగాన్ని ప్రారంభించాలనుకున్నారు.
ఇంతలోనే కొందరు సీనియర్ నాయకులు “సార్.. మీరు ఏమైనా చెప్పండి. వింటాం. కానీ పరిపూర్ణానంద సరస్వతి మాత్రం రానున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రచారానికి మాత్రం తీసుకురాకండి” అని చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
దీంతో ఒక్కసారిగా సమావేశ మందిరంలో కలకలం చెలరేగిందని అంటున్నారు. అప్పటివరకు పల్లెత్తు మాట కూడా మాట్లాడని సీనియర్లు కొందరు పరిపూర్ణానందను ప్రచారానికి తీసుకురావద్దు అంటూ తేల్చి చెప్పినట్లు చెబుతున్నారు. ఇటీవల ముగిసిన శాసనసభ ముందస్తు ఎన్నికల లో పరిపూర్ణానంద స్వామి రానంతవరకు పార్టీ పరిస్థితి బాగానే ఉందని, ఆయన అతి విశ్వాసం తో పాటు పార్టీలో సీనియర్లను విడివిడిగా కలుస్తూ గ్రూపులు కట్టడం వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోయిందని వివరణ ఇచ్చినట్లు చెబుతున్నారు.
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 70 సీట్లు గెలుస్తుందని, ఉత్తరప్రదేశ్ లో లాగే తెలంగాణలో కూడా ఓ స్వామి ముఖ్యమంత్రి అవుతారని పార్టీ నాయకుల వద్ద ప్రచారం చేశారన్నారు.
ఇది అటు పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఆందోళనకు గురిచేసిందని, దీంతో అంతవరకు పార్టీ గెలుపు కోసం పని చేయాలి అనుకున్న వారంతా మిన్నకుండిపోయారని పార్టీ సీనియర్లు జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కు తేల్చి చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
ఇన్నాళ్లు తెలంగాణలో పార్టీని కళ్ళల్లో పెట్టుకుని చూశామని, ముందు ముందు కూడా అదే పరిస్థితి ఉంటుందని చెప్పినట్లు సమాచారం. టికెట్ల పంపిణీ, జాతీయ నాయకులు ప్రచారానికి రావడం వంటి అంశాలను అధిష్టానం చూసుకోవాలని, ఇతర అంశాలపై… ముఖ్యంగా పరిపూర్ణానంద లాంటి వారిని ప్రచారానికి రానివ్వడం అనే అంశంపై స్థానిక నేతలకు వదిలేయాలని అమీత్ షాకు తేల్చి చెప్పినట్లు చెబుతున్నారు. ఈ హఠాత్పరిణామంతో అమిత్ షా మిన్నకుండిపోయారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.