Telugu Global
NEWS

బాబు వ‌ర్గం వారు వ‌స్తున్నారు... బీసీలు, ఇతరులు వెళ్తున్నారు !

నాయకులు పార్టీలు మారడం సహజం. అధికారం కోసం కొందరు… వ్యక్తిగత విభేదాలతో మరికొందరు… రాజకీయ భవిష్యత్తు కోసం ఇంకొందరు పార్టీలు మారడం దేశంలో అత్యంత సహజం. ఇలా పార్టీలు మారిన వారు తమ భవిష్యత్తు కోసం మాత్రమే మరో పార్టీలో చేరడం అనేది ఇన్నాళ్లు చూశాం. ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి మారింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి చెందిన అనేకమంది నాయకులు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సామాజికవర్గం నుంచి వస్తున్న ఇబ్బందులను తట్టుకోలేక […]

బాబు వ‌ర్గం వారు వ‌స్తున్నారు... బీసీలు, ఇతరులు వెళ్తున్నారు !
X

నాయకులు పార్టీలు మారడం సహజం. అధికారం కోసం కొందరు… వ్యక్తిగత విభేదాలతో మరికొందరు… రాజకీయ భవిష్యత్తు కోసం ఇంకొందరు పార్టీలు మారడం దేశంలో అత్యంత సహజం. ఇలా పార్టీలు మారిన వారు తమ భవిష్యత్తు కోసం మాత్రమే మరో పార్టీలో చేరడం అనేది ఇన్నాళ్లు చూశాం. ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి మారింది.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి చెందిన అనేకమంది నాయకులు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సామాజికవర్గం నుంచి వస్తున్న ఇబ్బందులను తట్టుకోలేక పార్టీ మారడం విశేషం.

తెలుగుదేశం పార్టీలో ఇన్నాళ్లు ఓ వెలుగు వెలిగి… ప్రజాప్రతినిధులుగా ప్రజలకు చేరువైన నాయకులు ఇప్పుడు ఆ పార్టీని వీడి ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇలా చేరుతున్న వారిలో బీసీలు, ఎస్సీలు, ఉన్నత కులాలకు చెందిన వైశ్యులు, కాపులు, బ్రాహ్మణులు, రెడ్లు ఉన్నారు.

వీరంతా తెలుగుదేశం పార్టీలో దశాబ్దాలుగా ఉన్నవారే. అయితే, గడచిన నాలుగున్నర సంవత్సరాలుగా పార్టీలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సామాజిక వర్గానికి చెందిన వారికి ప్రాధాన్యత కల్పించడం, తమను తక్కువ చేసి చూడటం వల్ల వారంతా పార్టీ మారుతున్నట్లుగా బహిరంగంగా ప్రకటిస్తున్నారు.

ఇక తెలుగుదేశం పార్టీలో కూడా వేరే పార్టీల నుంచి వచ్చి చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే వారంతా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం.

ఈ సామాజిక వర్గం కాకుండా ఇతర కులాలు, సామాజిక వర్గాలకు చెందిన వారు ఎవరు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముందుకు రాకపోవడం విశేషం. ఇదే విషయమై పార్టీ సీనియర్ నాయకులు కొందరు చంద్రబాబు నాయుడు వద్ద ప్రస్తావించినట్లు చెబుతున్నారు.

పార్టీ అధినేత మాత్రం “ఎవరు వెళ్లినా… ఎవరు వచ్చినా మీకు అనవసరం. మీకు అప్పగించిన పనులు మీరు పూర్తి చేయండి” అని హుకుం జారీ చేసినట్లు పార్టీ సీనియర్లు చెబుతున్నారు. బీసీల పార్టీగా చంద్రబాబు అభివర్ణించే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చంద్రబాబునాయుడు సామాజిక వర్గానికి చెందిన పార్టీగా మిగులుతుందని ఆ పార్టీ నాయకులు వాపోతున్నారు.

First Published:  7 March 2019 1:05 AM GMT
Next Story