చైతు కోసం ఫ్లాప్ డైరెక్టర్ ని సెట్ చేస్తున్న అరవింద్
అక్కినేని హీరోలు అయిన అఖిల్ కి చైతు కి ప్రస్తుతం పెద్దగా హిట్స్ లేవు. ఇక ఇటీవలే నాగార్జున అఖిల్ ని నిర్మాత అల్లు అరవింద కి అప్పగించి ఎలాగైనా అఖిల్ కి ఒక పెద్ద హిట్ పడాలి అని చెప్పాడట. అల్లు అరవింద్ కూడా అఖిల్ కోసం ప్రత్యేకంగా ఒక స్టొరీ రెడీ చేయిస్తున్నాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు నాగ […]

అక్కినేని హీరోలు అయిన అఖిల్ కి చైతు కి ప్రస్తుతం పెద్దగా హిట్స్ లేవు. ఇక ఇటీవలే నాగార్జున అఖిల్ ని నిర్మాత అల్లు అరవింద కి అప్పగించి ఎలాగైనా అఖిల్ కి ఒక పెద్ద హిట్ పడాలి అని చెప్పాడట. అల్లు అరవింద్ కూడా అఖిల్ కోసం ప్రత్యేకంగా ఒక స్టొరీ రెడీ చేయిస్తున్నాడు.
గీత ఆర్ట్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు నాగ చైతన్య కోసం కూడా ఒక డైరెక్టర్ ని సెట్ చేశాడట అల్లు అరవింద్. ఆ డైరెక్టర్ మరెవరో కాదు “మిస్టర్ పర్ఫెక్ట్” “సంతోషం” సినిమాలతో ఫ్యామిలీ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న దశరద్.
ఇటీవలే దశరద్ అల్లు అరవిందని కలిసి ఒక మంచి లైన్ చెప్పాడట. లైన్ నచ్చిన అల్లు అరవింద్ ఈ కథ నాగ చైతన్య కి అయితే బాగుంటుందని భావిస్తున్నాడట. నిజానికి నాగ చైతన్య కోసం “గీత గోవిందం” ఫేం పరశురాం ని డైరెక్టర్ గా సెట్ చేయబోయాడు అల్లు అరవింద్. కానీ ఆ ప్రాజెక్ట్ ఇంకా లేట్ అయ్యే అవకాశాలు ఉండటంతో ఈ గ్యాప్ లో దశరద్ ని లైన్ లోకి దింపాడు.