Telugu Global
NEWS

మీడియాకు చంద్రబాబు వార్నింగ్

డేటా చోరీ, ఓటుకు నోటు లేటెస్ట్ వీడియో పై ప్రశ్నించిన మీడియా ప్రతినిధిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రుసరుసలాడారు. ఒక చానల్‌ రిపోర్టర్‌ ఈ అంశాలపై ప్రశ్నించడంతో.. మీ మీడియా సంస్థకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఒకసారి చెబితే వినాలని హెచ్చరించారు. ఇప్పటికే టీడీపీ సమావేశాలకు రాకుండా సదరు మీడియా సంస్థపై బ్యాన్ విధించిన చంద్రబాబు… ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా ఆహ్వనించబోమని వార్నింగ్ ఇచ్చారు. మీరు పిలిస్తేనే ప్రెస్‌మీట్‌కు వచ్చామని మీడియా ప్రతినిధి చెప్పగా చంద్రబాబు […]

మీడియాకు చంద్రబాబు వార్నింగ్
X

డేటా చోరీ, ఓటుకు నోటు లేటెస్ట్ వీడియో పై ప్రశ్నించిన మీడియా ప్రతినిధిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రుసరుసలాడారు.

ఒక చానల్‌ రిపోర్టర్‌ ఈ అంశాలపై ప్రశ్నించడంతో.. మీ మీడియా సంస్థకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఒకసారి చెబితే వినాలని హెచ్చరించారు. ఇప్పటికే టీడీపీ సమావేశాలకు రాకుండా సదరు మీడియా సంస్థపై బ్యాన్ విధించిన చంద్రబాబు… ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా ఆహ్వనించబోమని వార్నింగ్ ఇచ్చారు.

మీరు పిలిస్తేనే ప్రెస్‌మీట్‌కు వచ్చామని మీడియా ప్రతినిధి చెప్పగా చంద్రబాబు మరింత ఆగ్రహించారు. మిమ్మల్ని ప్రభుత్వ మీటింగ్‌లకు కూడా రానివ్వమని హెచ్చరించారు. చంద్రబాబుకు సపోర్టుగా మంత్రులు కాల్వ, కళా వెంకట్రావ్ వచ్చారు. మీడియా ప్రతినిధిని బెదిరిస్తూ సైగలు చేశారు.

ఓటుకు నోటు కేసుతో తనకేం సంబంధం అని చంద్రబాబు ప్రశ్నించారు. ఎవరో కార్యకర్తలు పార్టీ కోసం పది రూపాయలు ఖర్చు చేస్తుంటారని ఇది అంతేనని చెప్పారు చంద్రబాబు.

డేటా లీక్‌ పైనా ఎదురుదాడి చేశారు సీఎం. కార్యకర్తలకు ఓటర్ల జాబితా ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఎవరికి ఓటేస్తారని అడగటం తప్పా..? అని ప్రశ్నించారు. తమ డేటానే దొంగలించారని చంద్రబాబు ఫైర్ అయ్యారు.

First Published:  7 March 2019 7:14 AM GMT
Next Story