Telugu Global
NEWS

మేం చెప్పిన వారికే టిక్కెట్లు ఇవ్వాలి: బాబుపై పెరుగుతున్న ఒత్తిడి

మొగుడు కొట్టడం చూసిన ముష్టి వాడు కూడా ఇల్లాలలిపై రెండు రాళ్లు వేశాడన్నది తెలుగు సామెత. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి… ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు పరిస్థితి ఈ సామెతకు అచ్చుగుద్దినట్లుగా సరిపోతుంది అంటున్నారు. గత నెల రోజులుగా చంద్రబాబు నాయుడు శాసనసభ, లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు. ఈ ప్రక్రియ సజావుగా జరుగుతోందని, ఎంపికలో ఎలాంటి ఇబ్బందులు ఎదురు […]

మేం చెప్పిన వారికే టిక్కెట్లు ఇవ్వాలి: బాబుపై పెరుగుతున్న ఒత్తిడి
X

మొగుడు కొట్టడం చూసిన ముష్టి వాడు కూడా ఇల్లాలలిపై రెండు రాళ్లు వేశాడన్నది తెలుగు సామెత. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి… ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు పరిస్థితి ఈ సామెతకు అచ్చుగుద్దినట్లుగా సరిపోతుంది అంటున్నారు. గత నెల రోజులుగా చంద్రబాబు నాయుడు శాసనసభ, లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు. ఈ ప్రక్రియ సజావుగా జరుగుతోందని, ఎంపికలో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావడం లేదంటూ ఎల్లో మీడియా రకరకాల కథనాలు ప్రతిరోజు ప్రచారం చేస్తోంది. అయితే దీని వెనుక మాత్రం నిగూడంగా ఓ రహస్యం దాగి ఉందని అంటున్నారు. అదేమిటి అనుకుంటున్నారా..?

లోక్‌సభకు పోటీ చేయాలని నిర్ణయించిన పార్టీ అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల పరిధిలోని పలు శాసన సభ నియోజకవర్గాలకు తాము సూచించిన అభ్యర్థులకే టికెట్‌లు ఇవ్వాలని అధినేత చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల్లో తాము విజయం సాధించి కేంద్రంలో తమ పార్టీ… ముఖ్యంగా చంద్రబాబు చక్రం తిప్పాలంటే తమ మాట వినాల్సిందే అంటూ పట్టుబడుతున్నట్లుగా చెప్తున్నారు.

అనంతపురం లోకసభ సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి తన నియోజకవర్గంతో పాటు జిల్లాలోని సిట్టింగ్ శాసనసభ్యులు సగం మందికిపైగా మార్చాలని చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఆయన పెద్ద తలనొప్పిగా మారారు అనుకుంటున్న సమయంలో ఇతర పార్లమెంటు స్థానాల నుంచి కూడా ఇలాంటి డిమాండ్లే వస్తున్నాయి. విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, కడప, కర్నూలు, చివరకు తన మనిషి అనుకుంటున్న గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ కూడా తాను సూచించిన వారికే టిక్కెట్లు ఇవ్వాలని చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.

రోజురోజుకూ మారుతున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, దీని నుంచి బయటపడి లోకసభ సభ్యులు గెలవాలంటే తాము చెప్పిన వారికే టిక్కెట్లు ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ ఏపీలో విజయం సాధించడం కంటే కేంద్రంలో ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవడం ముఖ్యమని, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే తీవ్రంగా నష్టపోయేది తమ నాయకుడు చంద్రబాబునాయుడే అంటూ సిట్టింగ్ ఎంపీలు కొందరు నర్మగర్భంగా హెచ్చరించినట్లు చెబుతున్నారు.

దీంతో ఏం చేయాలో పాలుపోని చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో, పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెప్తున్నారు. తాను ఎవరికి టిక్కెట్ ఇవ్వాలో కూడా సిట్టింగ్ ఎంపీలే నిర్ణయించడం పార్టీలో గతంలో ఎప్పుడు లేదని, ఇది ఒక రకంగా తనను అవమానించడమేనని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినట్లు సమాచారం.

First Published:  6 March 2019 3:14 AM IST
Next Story