Telugu Global
National

చివరి క్యాబినెట్ లో మోడీ మ్యాజిక్ ఉంటుందా!

దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఏ రాష్ట్రంలో చూసినా లోక్‌స‌భ‌ ఎన్నికల హడావుడే కనిపిస్తోంది. గత నెల రోజులుగా దేశవ్యాప్తంగా మారుతున్న పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు భారతీయ జనతా పార్టీ అధిష్టానం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా పుల్వామా దాడిలో సైనికులు మరణించిన తర్వాత చేపట్టిన వైమానిక దాడులతో సహా అన్ని అంశాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పావులు కదుపుతున్నారు. ఇక గురువారం రోజు […]

చివరి క్యాబినెట్ లో మోడీ మ్యాజిక్ ఉంటుందా!
X

దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఏ రాష్ట్రంలో చూసినా లోక్‌స‌భ‌ ఎన్నికల హడావుడే కనిపిస్తోంది. గత నెల రోజులుగా దేశవ్యాప్తంగా మారుతున్న పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు భారతీయ జనతా పార్టీ అధిష్టానం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా పుల్వామా దాడిలో సైనికులు మరణించిన తర్వాత చేపట్టిన వైమానిక దాడులతో సహా అన్ని అంశాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పావులు కదుపుతున్నారు.

ఇక గురువారం రోజు చివరి సారిగా భేటీ కానున్న కేంద్ర క్యాబినెట్ సమావేశం ప్రధాన ఎజెండా సార్వత్రిక ఎన్నికలే. మరో వారం రోజుల్లో లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందనుకుంటున్న తరుణంలో ఈ సమావేశం జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో జరిగే ఈ సమావేశంపై అధికార పక్షంతో సహా ప్రతిపక్షాలు కూడా ఎంతో ఉత్సకతతో ఎదురు చూస్తున్నాయి.

నరేంద్ర మోడీ ఈ క్యాబినెట్ సమావేశంలో తీసుకునే నిర్ణయాల ప్రభావం రానున్న ఎన్నికలలో ఏ మేరకు ఉంటుందో అంచనా వేసేందుకు అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కుంభకోణం, నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి కీలక నిర్ణయాలతో మసకబారిన నరేంద్ర మోడీ ప్రతిష్టను వైమానిక దాడులతోను, సైనిక చర్యలతోను తిరిగి తెచ్చుకుందామని బీజేపీ భావిస్తోంది.

ఇక ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ సమావేశం కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఉత్తరాదిన రైతులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆగ్రహంతో ఉన్నారు. రోడ్డు మీదకు వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు. వీరిని ఆగ్రహాన్ని చల్లబరచడంతో పాటు చ‌క్కెర‌ ఫ్యాక్టరీలకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలకు సంబంధించి కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంటుందని అనుకుంటున్నారు.

ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో మధ్యతరగతిని ఆకట్టుకునేందుకు పన్ను పరిమితిని పెంచడం, గృహ నిర్మాణాలపై జీఎస్టీ తగ్గించడం వంటి చర్యలు కేంద్రం తీసుకుంది. ఇక ఇది ఎన్నికల ముందు క్యాబినెట్ కావడంతో యువకులు, మహిళలు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారిని, చిన్న మధ్య తరహా తో సహా చిరు వ్యాపారులను కూడా ఆకర్షించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ వరాల జల్లు కురిపిస్తానని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

భారతీయ జనతా పార్టీ పట్ల మధ్యతరగతి, మేధావి వర్గాలలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. వీరిని కూడా తన వైపు తిప్పుకునేందుకు ఈ క్యాబినెట్‌ను కూడా వాడుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ భావిస్తున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్డీఏ మిత్రపక్షాలను కూడా సంతృప్తి పరిచేలా కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు తీసుకుంటుందని వారు చెబుతున్నారు. గురువారం నాటి కేబినెట్ సమావేశ నిర్ణయాలే.. రానున్న ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ జయాపజయాలను నిర్ణ‌యిస్తాయ‌ని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

First Published:  6 March 2019 10:33 AM GMT
Next Story