బోయపాటి సినిమాకి ప్రొడ్యూసర్ని మార్చిన బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది “ఎన్టీఆర్” బయోపిక్ రెండు భాగాలతో భారీ ఫ్లాప్స్‌ని చవిచూసాడు. సీనియర్ ఎన్టీఆర్ మీద బయోపిక్ తీస్తే తప్పకుండా చూస్తారనే నమ్మకంతో గుడ్డిగా వెళ్లి బోల్తా పడ్డాడు బాలయ్య. క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని వారాహి చలన చిత్రం వాళ్ళతో కలిసి బాలకృష్ణ ప్రొడ్యూస్ చేసాడు. బాలకృష్ణ ఇక ఇప్పుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న తన తదుపరి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ […]
నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది “ఎన్టీఆర్” బయోపిక్ రెండు భాగాలతో భారీ ఫ్లాప్స్‌ని చవిచూసాడు. సీనియర్ ఎన్టీఆర్ మీద బయోపిక్ తీస్తే తప్పకుండా చూస్తారనే నమ్మకంతో గుడ్డిగా వెళ్లి బోల్తా పడ్డాడు బాలయ్య. క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని వారాహి చలన చిత్రం వాళ్ళతో కలిసి బాలకృష్ణ ప్రొడ్యూస్ చేసాడు.
బాలకృష్ణ ఇక ఇప్పుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న తన తదుపరి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమా జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్‌కి వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాని మొదట నందమూరి బాలయ్య తన ఎన్బికే ఫిలిమ్స్‌పై తానే స్వయంగా ప్రొడ్యూస్ చేస్తూ వారాహి వాళ్ళని కూడా పార్టనర్స్‌గా పెట్టుకుందాం అనుకున్నాడు.
తాజాగా తాను ప్రొడ్యూసర్‌గా తప్పకోవడమే కాక వారాహి వాళ్లకు కూడా ఛాన్స్ ఇవ్వలేదు. బోయపాటి సినిమాకు ప్రొడ్యూస్ చేయమని సి. కళ్యాణ్‌కు చెప్పాడంటా . అసలైతే వినాయక్ డైరెక్టర్‌గా చేయవలసిన సినిమాను కళ్యాణ్ ప్రొడ్యూస్ చేయాలి. కాని ఆ సినిమా కాన్సిల్ అవ్వడంతో బోయపాటి శ్రీను సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకి వచ్చాడు సి.కళ్యాణ్.