డేటా స్కాం... కీలక వ్యక్తి కోడ్ భాషలో మాట్లాడారు... అతడి పేరు త్వరలోనే వెల్లడిస్తాం...
ఏపీ ప్రజల వ్యక్తిగత వివరాల చోరీ కేసులో హైదరాబాద్ కమిషనర్ అంజనీకుమార్ సంచలన విషయాలు చెప్పారు. ఈ వ్యవహారంలో ఒక కీలక వ్యక్తి ప్రమేయం ఉందన్నారు. కోడ్ భాషలో మాట్లాడారని కమిషనర్ చెప్పారు. ఆ భాషను డీకోడ్ చేస్తున్నామన్నారు. ఆ కీలక వ్యక్తి పేరును త్వరలోనే వెల్లడిస్తామని కమిషనర్ చెప్పారు. టీడీపీ సేవా మిత్రా యాప్ ద్వారా ఏపీలో ఓట్లు తొలగించారని హైదరాబాద్ కమిషనర్ అంజనీకుమార్ చెప్పారు. హైదరాబాద్‌లో నేరం జరిగింది కాబట్టి ఇక్కడే కేసు నమోదు […]
ఏపీ ప్రజల వ్యక్తిగత వివరాల చోరీ కేసులో హైదరాబాద్ కమిషనర్ అంజనీకుమార్ సంచలన విషయాలు చెప్పారు. ఈ వ్యవహారంలో ఒక కీలక వ్యక్తి ప్రమేయం ఉందన్నారు. కోడ్ భాషలో మాట్లాడారని కమిషనర్ చెప్పారు. ఆ భాషను డీకోడ్ చేస్తున్నామన్నారు. ఆ కీలక వ్యక్తి పేరును త్వరలోనే వెల్లడిస్తామని కమిషనర్ చెప్పారు.
టీడీపీ సేవా మిత్రా యాప్ ద్వారా ఏపీలో ఓట్లు తొలగించారని హైదరాబాద్ కమిషనర్ అంజనీకుమార్ చెప్పారు. హైదరాబాద్‌లో నేరం జరిగింది కాబట్టి ఇక్కడే కేసు నమోదు చేశామన్నారు. జరిగింది అతి పెద్ద నేరం అన్నారు. రహస్యంగా ఉండాల్సిన ప్రజల డేటా ఐటీ గ్రిడ్స్ వద్దకు వెళ్లిపోయిందన్నారు.
సర్వర్లలో ఉంచిన డేటాను ఇవ్వాల్సిందిగా అమెజాన్ సంస్థను కోరామన్నారు. ఏపీ ప్రజలకు సంబంధించిన సమాచారం మొత్తం ఐటీ గ్రిడ్స్ వద్ద ఉందన్నారు. సేవా మిత్రా యాప్ ద్వారా సర్వే చేస్తూ ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుని ఆ వివరాల ఆధారంగా ఎన్నికల సరళిని ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారన్నారు. దాకవరపు అశోక్‌ను త్వరలోనే పట్టుకుంటామని అంజనీకుమార్ చెప్పారు.