టీడీపీ తరపున లగడపాటి మంతనాలు ?
మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్… తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహాకూటమికి అనుకూలంగా సర్వే ఫలితాలు ప్రకటించి చివరకు అభాసుపాలయ్యారు. లగడపాటి చంద్రబాబు మనిషి అన్న ముద్ర వేయించుకున్నారు. ఆ తర్వాత కూడా లగడపాటి రాజగోపాల్ టీడీపీ పెద్దలతోనే సన్నిహితంగా ఉంటున్నారు. ఆ మధ్య ఒక పత్రికాధినేతతో కలిసి అర్థరాత్రి వెళ్లి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇప్పుడు లగడపాటి వరుసగా పలువురు నేతలతో మంతనాలు జరుపుతున్నారు. మంగళవారం స్పీకర్ కోడెల శివప్రసాదరావుతో లగడపాటి భేటీ అయ్యారు. ప్రస్తుత […]

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్… తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహాకూటమికి అనుకూలంగా సర్వే ఫలితాలు ప్రకటించి చివరకు అభాసుపాలయ్యారు. లగడపాటి చంద్రబాబు మనిషి అన్న ముద్ర వేయించుకున్నారు. ఆ తర్వాత కూడా లగడపాటి రాజగోపాల్ టీడీపీ పెద్దలతోనే సన్నిహితంగా ఉంటున్నారు.
ఆ మధ్య ఒక పత్రికాధినేతతో కలిసి అర్థరాత్రి వెళ్లి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇప్పుడు లగడపాటి వరుసగా పలువురు నేతలతో మంతనాలు జరుపుతున్నారు. మంగళవారం స్పీకర్ కోడెల శివప్రసాదరావుతో లగడపాటి భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఏపీ ప్రజల డేటా దొంగతనం వ్యవహారంపై వారు చర్చించినట్టు చెబుతున్నారు.
కోడెలతో భేటీ తర్వాత లగడపాటి రాజగోపాల్…. వంగవీటి రాధాను కలిశారు. టీడీపీలో చేరే ఉద్దేశంతో వైసీపీకి రాజీనామా చేసి రాధా బయటకు వచ్చారు. ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారని భావించారు. కానీ అలా జరగలేదు. ఈ నేపథ్యంలో రాధాతో లగడపాటి భేటీ ఆసక్తికరంగా ఉంది. ఇది రాజకీయ భేటీనే అని చెబుతున్నారు.