త్రివిక్రమ్ కథ ఇంకా రెడీ చేయలేదంటా..!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్ అయిన విషయం అందరికి తెలిసిందే. హారిక హాసిని క్రియేషన్స్‌తో పాటు గీత ఆర్ట్స్ కూడా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయబోతుంది. ఇక ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు అనౌన్స్ అయ్యిందో అప్పటి నుంచి ఈ సినిమాపై అందరిలో భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా కథ బాగా రావడానికి త్రివిక్రమ్ చాలా కష్టపడుతున్నాడట. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటి వరకు ఈ సినిమా ఫస్ట్ […]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్ అయిన విషయం అందరికి తెలిసిందే. హారిక హాసిని క్రియేషన్స్‌తో పాటు గీత ఆర్ట్స్ కూడా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయబోతుంది. ఇక ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు అనౌన్స్ అయ్యిందో అప్పటి నుంచి ఈ సినిమాపై అందరిలో భారీ అంచనాలు పెరిగిపోయాయి.
ఇదిలా ఉంటే ఈ సినిమా కథ బాగా రావడానికి త్రివిక్రమ్ చాలా కష్టపడుతున్నాడట. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటి వరకు ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మాత్రమే పూర్తి చేసాడు అంటా. ఫస్ట్ హాఫ్ సూపర్‌గా రావడంతో సెకండ్ హాఫ్ కోసం ఇంకొంచెం ఎక్కువ టైం తీసుకోవడానికి రెడీ అయ్యాడట త్రివిక్రమ్.
మరో పక్క అల్లు అర్జున్.. సుకుమార్‌తో తన తదుపరి సినిమా ఉంటుంది అని కూడా అనౌన్స్ చేసాడు. అక్కడ సుకుమార్‌కి మహేష్ బాబు కథ విషయంలో సెట్ అవ్వకపోతే అదే కథని అల్లు అర్జున్ దగ్గరకి పట్టుకొని వచ్చాడు సుకుమార్.
మరి ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా కథకు కరెక్ట్‌గా సెట్ అవ్వకపోతే అల్లు అర్జున్ వెంటనే సుకుమార్ సినిమా స్టార్ట్ చేయాలి అనే ఊపులో ఉన్నాడు.