డేటా చోరీ కేసు ఎఫెక్ట్ : తెలంగాణ బకాయిలు వెంటనే వసూలు చేయాలని బాబు ఆదేశం..?
ఏపీ మంత్రివర్గ సమావేశం ఇవాళ అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా డేటా చోరీ కేసు గురించే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఏపీ ప్రజల వివరాలు బయటకు పొక్కిన ఘటనను తీవ్రంగా పరిగణించాలని కేబినెట్ అభిప్రాయపడింది. ఈ కేసు విషయంలో ఎలా వెళ్లాలనే దానిపై సీఎం సహా మంత్రివర్గమంతా చర్చోపచర్చలు చేసినట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వ వేధింపులు ఎక్కువయ్యాయని మంత్రి వర్గం అన్నట్లు తెలుస్తోంది. దీనిపై సీఎంపై మంత్రులు ఒత్తిడి తెచ్చినట్లు […]
ఏపీ మంత్రివర్గ సమావేశం ఇవాళ అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా డేటా చోరీ కేసు గురించే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఏపీ ప్రజల వివరాలు బయటకు పొక్కిన ఘటనను తీవ్రంగా పరిగణించాలని కేబినెట్ అభిప్రాయపడింది.
ఈ కేసు విషయంలో ఎలా వెళ్లాలనే దానిపై సీఎం సహా మంత్రివర్గమంతా చర్చోపచర్చలు చేసినట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వ వేధింపులు ఎక్కువయ్యాయని మంత్రి వర్గం అన్నట్లు తెలుస్తోంది. దీనిపై సీఎంపై మంత్రులు ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం.
దీంతో ముందుగా తెలంగాణ ప్రభుత్వం నుంచి రావల్సిన బకాయిలను వెంటనే వసూలు చేయాలని సంబంధిత మంత్రులను ఆదేశించారు. విద్యుత్ బకాయిలు, పోలవరం ప్రాజెక్టుపై వేసిన కేసులను తీవ్రంగా పరిగణించాలని నిర్ణయించారు. అలాగే ఏపీ పోలీసుల మీద కూడా తెలంగాణ ప్రభుత్వం వేయాలనుకుంటున్న కేసులపై ఆరా తీయమన్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర విభజన తర్వాత ఆస్తుల పంపిణీకి సహకరించకపోగా పలు ఆటంకాలను తెలంగాణ ప్రభుత్వం కలుగ జేస్తోందని.. వీటన్నింటినీ ఏపీ ప్రభుత్వం వెంటనే రాబట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది.