ప్రతి కార్యకర్త ఈ పని తప్పకచేయండి- జగన్
తెలుగు దేశం పార్టీ కుట్ర పూరితంగా ఓట్లు తొలగిస్తున్న నేపథ్యంలో ప్రతి కార్యకర్త, పార్టీ బూత్ కన్వీనర్లు అప్రమత్తంగా ఉండాలని వైసీపీ అధినేత జగన్ సూచించారు. కార్యకర్తలు, బూత్ కన్వీనర్లు ప్రజల వద్దకు వెళ్లి వారి ఓట్లు ఉన్నాయో లేవో సరిచూసుకోవాలన్నారు. అధికారంలోకి వచ్చాక కులం, మతం చూడకుండా అన్ని వర్గాలకు న్యాయం చేస్తామన్నారు జగన్. ప్రతి కార్యకర్త గర్వపడేలా పాలన ఉంటుందన్నారు. ఈ ఐదేళ్లలో ప్రజలకు ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాల్సిన చంద్రబాబు… దొంగ […]
తెలుగు దేశం పార్టీ కుట్ర పూరితంగా ఓట్లు తొలగిస్తున్న నేపథ్యంలో ప్రతి కార్యకర్త, పార్టీ బూత్ కన్వీనర్లు అప్రమత్తంగా ఉండాలని వైసీపీ అధినేత జగన్ సూచించారు. కార్యకర్తలు, బూత్ కన్వీనర్లు ప్రజల వద్దకు వెళ్లి వారి ఓట్లు ఉన్నాయో లేవో సరిచూసుకోవాలన్నారు.
అధికారంలోకి వచ్చాక కులం, మతం చూడకుండా అన్ని వర్గాలకు న్యాయం చేస్తామన్నారు జగన్. ప్రతి కార్యకర్త గర్వపడేలా పాలన ఉంటుందన్నారు. ఈ ఐదేళ్లలో ప్రజలకు ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాల్సిన చంద్రబాబు… దొంగ ఓట్లు చేర్పించి గెలవాలనుకుంటున్నారన్నారు. 59 లక్షల దొంగ ఓట్లు చేర్పించారన్నారు. తిరిగి చంద్రబాబు వైసీపీ వాళ్లే వ్యవస్థలను నాశనం చేస్తున్నారని చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. చివరకు తన సొంత చిన్నాన్న వివేకానందరెడ్డి ఓటును కూడా తీసేశారన్నారు జగన్.
కేవలం ఎన్నికల సంఘం వద్ద మాత్రమే ఉండాల్సిన కలర్ ఫోటోల డేటా, ఆధార్ డేటా మొత్తం టీడీపీకి చెందిన ప్రైవేట్ కంపెనీల వద్ద ఉండడం దేనికి నిదర్శనమని జగన్ ప్రశ్నించారు. ప్రజల వ్యక్తిగత డేటా దొంగలించి ఇప్పుడు ఆ డేటా అంతా తనదేనని చంద్రబాబు వితండవాదం చేస్తున్నారన్నారు. పచ్చ మీడియా తోడు ఉందన్న ధైర్యంతో చంద్రబాబు ఎదురుదాడి చేస్తున్నారని జగన్ ఫైర్ అయ్యారు. ఏపీని ఒక రాక్షసుడు పాలిస్తున్నాడని జగన్ విమర్శించారు.
పోలీసులను వ్యక్తిగత పనులకు వాడుకుంటున్న వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయినప్పుడు మాట్లాడినట్టుగానే డేటా దొంగతనం వ్యవహారంలోనూ చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు. తన వ్యతిరేకుల ఓట్ల తొలగించడమే కాకుండా… మనుషులను చంపించడం, గ్రామాలను తగలబెట్టించడం కూడా చేసేలా ఉన్నారని జగన్ అనుమానం వ్యక్తం చేశారు.
వైసీపీ కార్యకర్తలు, బూన్ కన్వీనర్లు ప్రజల వద్దకు వెళ్లి వారి ఓట్ల ఉన్నాయో లేవో సరి చూసుకునేలా సాయపడాలని జగన్ సూచించారు.