తాత్కాలిక శంకుస్థాపన శిలాపలకంపై సోషల్ మీడియాలో చర్చ
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ప్రభుత్వానికి తాత్కాలికం అన్న పదం కొత్తేమీ కాదు. తాత్కాలిక రాజధాని నుంచి తాత్కాలిక హైకోర్టు భవనం వరకు అన్ని చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు తాత్కాలిక శంకుస్థాపన ఏర్పాటుపైనా చర్చ జరుగుతోంది. ఒక ఫోటో సోషల్ మీడియాలో తాత్కాలిక శంకుస్థాపన శిలాపలకాలపై చర్చకు దారి తీసింది. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని ఒక గ్రామంలో తారు రోడ్డు నిర్మాణం కోసం ఇటీవల ఎమ్మెల్యే యామినిబాల శంకుస్థాపన చేశారు. అయితే సాధారణంగా శిలాపలకం దిమ్మె సిమెంట్‌తో […]
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ప్రభుత్వానికి తాత్కాలికం అన్న పదం కొత్తేమీ కాదు. తాత్కాలిక రాజధాని నుంచి తాత్కాలిక హైకోర్టు భవనం వరకు అన్ని చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు తాత్కాలిక శంకుస్థాపన ఏర్పాటుపైనా చర్చ జరుగుతోంది.
ఒక ఫోటో సోషల్ మీడియాలో తాత్కాలిక శంకుస్థాపన శిలాపలకాలపై చర్చకు దారి తీసింది. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని ఒక గ్రామంలో తారు రోడ్డు నిర్మాణం కోసం ఇటీవల ఎమ్మెల్యే యామినిబాల శంకుస్థాపన చేశారు.
అయితే సాధారణంగా శిలాపలకం దిమ్మె సిమెంట్‌తో నిర్మించడం చూసిన జనానికి ఇక్కడ ఐరన్ స్టాండ్ సాయంతో ఏర్పాటు చేసిన శిలాపలకం ఆసక్తిగా మారింది. దీన్ని ఒక చోట నుంచి మరొక చోటికి తీసుకెళ్లే వెసులుబాటు కూడా ఉందని చెబుతున్నారు. దీంతో ఈ ఫోటో ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతోంది. శంకుస్థాపనలోనూ తాత్కాలిక ఏర్పాట్లేనా అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అయితే ఈ ఏర్పాటు ఎందుకు చేయాల్సి వచ్చిందో!.