టీడీపీకి మరో షాక్...
టీడీపీకి మరో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామా చేశారు. పార్టీ సీనియర్ నేత, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తన రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపించారు. వ్యక్తిగత కారణాలతో ఇష్టపూర్వకంగానే రాజీనామా చేస్తున్నానని దాన్ని ఆమోదించాలని ఆయన కోరారు. అంతకు ముందు నియోజకవర్గ అనుచరులతో సమావేశం అయిన మోదుగుల సమావేశంలో కన్నీరు పెట్టుకున్నారు. టీడీపీలో తనకు అవమానాలు జరిగాయని వాపోయారు. చంద్రబాబు తనకు ఫోన్ చేస్తారని ఎదురుచూశానని కానీ ఎలాంటి స్పందన లేదన్నారు. అందుకే రాజీనామా […]
టీడీపీకి మరో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామా చేశారు. పార్టీ సీనియర్ నేత, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తన రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపించారు. వ్యక్తిగత కారణాలతో ఇష్టపూర్వకంగానే రాజీనామా చేస్తున్నానని దాన్ని ఆమోదించాలని ఆయన కోరారు. అంతకు ముందు నియోజకవర్గ అనుచరులతో సమావేశం అయిన మోదుగుల సమావేశంలో కన్నీరు పెట్టుకున్నారు. టీడీపీలో తనకు అవమానాలు జరిగాయని వాపోయారు. చంద్రబాబు తనకు ఫోన్ చేస్తారని ఎదురుచూశానని కానీ ఎలాంటి స్పందన లేదన్నారు. అందుకే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
మోదుగుల వైసీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. గుంటూరు లేదా నరసరావుపేట లోక్‌సభ స్థానాల్లో ఏదో ఒక చోట ఆయనకు అవకాశం ఇస్తారని చెబుతున్నారు. అయితే నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు రత్తయ్య కుమారుడు కృష్ణదేవరాయలు అన్ని సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మోదుగులను గుంటూరు ఎంపీగా బరిలో దింపే అవకాశం ఉంది.
గుంటూరు వైసీపీ పార్లమెంట్ ఇన్‌చార్జ్‌గా ఉన్న కిలారి రోశయ్యను అసెంబ్లీకి పోటీ చేయించే అవకాశం ఉందని చెబుతున్నారు. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి 2009లో నరసరావుపేట నుంచి టీడీపీ తరపున ఎంపీగా గెలిచారు. అయితే 2014కు వచ్చే సరికి సీన్ మారిపోయింది. కాంగ్రెస్ నుంచి వచ్చిన రాయపాటి సాంబశివరావుకు స్థానం కల్పించేందుకు మోదుగులను ఎమ్మెల్యేగా పోటీ చేయించి… నరసరావుపేట ఎంపీ స్థానాన్ని రాయపాటికి చంద్రబాబు అప్పగించారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత మోదుగులకు పార్టీలో ప్రాధాన్యత కూడా తగ్గిస్తూ వచ్చారు. మోదుగులను ఒంటిరి చేసేందుకు మంత్రి పత్తిపాటి పుల్లారావు నేతృత్వంలో ఒక వర్గం పనిచేసిందన్నది మోదుగుల అనుచరుల ఆరోపణ.