Telugu Global
NEWS

చంద్రబాబే దొంగ... కేసు బదిలీ చేయం

ఏపీ ప్రజల వ్యక్తిగత డేటా చోరీ నేరం జరిగింది హైదరాబాద్‌లో కాబట్టి ఇక్కడి పోలీసులు విచారణ జరుపుతున్నారన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. నిజంగా నేరం చేసి ఉండకపోతే ఏపీ పోలీసులు వచ్చి హైదరాబాద్‌లో ఫిర్యాదుదారుడు లోకేశ్వర్‌రెడ్డిని అరెస్ట్‌ చేసేందుకు ఎందుకు ప్రయత్నించారని ప్రశ్నించారు. ఈ కేసులో నిందితులు టీడీపీ, చంద్రబాబే అన్నారు. ముఖ్యమంత్రే ప్రజల వ్యక్తిగత వివరాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రజలే ఆలోచించుకోవాలన్నారు. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండేందుకు అర్హుడో కాదో […]

చంద్రబాబే దొంగ... కేసు బదిలీ చేయం
X

ఏపీ ప్రజల వ్యక్తిగత డేటా చోరీ నేరం జరిగింది హైదరాబాద్‌లో కాబట్టి ఇక్కడి పోలీసులు విచారణ జరుపుతున్నారన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. నిజంగా నేరం చేసి ఉండకపోతే ఏపీ పోలీసులు వచ్చి హైదరాబాద్‌లో ఫిర్యాదుదారుడు లోకేశ్వర్‌రెడ్డిని అరెస్ట్‌ చేసేందుకు ఎందుకు ప్రయత్నించారని ప్రశ్నించారు.

ఈ కేసులో నిందితులు టీడీపీ, చంద్రబాబే అన్నారు. ముఖ్యమంత్రే ప్రజల వ్యక్తిగత వివరాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రజలే ఆలోచించుకోవాలన్నారు. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండేందుకు అర్హుడో కాదో ఏపీ ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. ఫిర్యాదు ఆధారంగా సైబరాబాద్‌ పోలీసులు దర్యాప్తు చేస్తుంటే చంద్రబాబు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు.

దొంగకు నోరెక్కువ అన్నట్టుగా చంద్రబాబు తిరిగి తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. తప్పు చేయకుంటే చంద్రబాబు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజల్లో పలుకుబడి తగ్గిపోయినప్పుడే ఇలాంటి పనులు చేస్తుంటారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ఐదేళ్లలో చేసింది ఏమీ లేదు కాబట్టే చంద్రబాబు… అడ్డదారుల్లో గెలవాలనుకుంటున్నారన్నారు. ప్రజలకు సంబంధించిన ఆధార్‌, బ్యాంకు ఖాతాల వంటి వివరాలు కూడా టీడీపీ చేతికి ఎలా చేరాయో ప్రజలు ప్రశ్నించాలన్నారు. ఈ కేసులో ఏపీ ముఖ్యమంత్రే దొంగగా ఉన్నప్పుడు కేసును ఏపీకి ఎలా బదిలీ చేస్తామని ప్రశ్నించారు.

First Published:  4 March 2019 8:40 AM IST
Next Story