రిటైర్డ్ ఐఏఎస్ సత్యనారాయణపై బుగ్గన అనుమానం
ఏపీ ప్రజల వ్యక్తిగత వివరాల చోరీ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన అధికారులు పెద్ద పొరపాటు చేశారని… వారు దాని పర్యవసనాలను ఎదుర్కోక తప్పదన్నారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఆధార్ చైర్మన్‌గా వ్యవహరించిన మాజీ ఐఏఎస్ సత్యనారాయణను చంద్రబాబు తెచ్చుకుని సలహాదారుడిగా పెట్టుకున్నారని బుగ్గన చెప్పారు. ఆధార్ సమాచారం వాడుకునేందుకే చంద్రబాబు సత్యనారాయణను తెచ్చుకున్నారని ఆరోపించారు. ఆధార్ డేటా లీకేజ్‌పై తాను ఇప్పటికే ఫిర్యాదు చేసినా చర్యలు లేవన్నారు. ఇవన్నీ చూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఇదే సత్యనారాయణ […]
ఏపీ ప్రజల వ్యక్తిగత వివరాల చోరీ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన అధికారులు పెద్ద పొరపాటు చేశారని… వారు దాని పర్యవసనాలను ఎదుర్కోక తప్పదన్నారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఆధార్ చైర్మన్‌గా వ్యవహరించిన మాజీ ఐఏఎస్ సత్యనారాయణను చంద్రబాబు తెచ్చుకుని సలహాదారుడిగా పెట్టుకున్నారని బుగ్గన చెప్పారు.
ఆధార్ సమాచారం వాడుకునేందుకే చంద్రబాబు సత్యనారాయణను తెచ్చుకున్నారని ఆరోపించారు. ఆధార్ డేటా లీకేజ్‌పై తాను ఇప్పటికే ఫిర్యాదు చేసినా చర్యలు లేవన్నారు. ఇవన్నీ చూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయన్నారు.
ఇదే సత్యనారాయణ కోటి 25 లక్షలు పెట్టి ప్లాట్ కొనుక్కున్నారని వివరించారు. సత్యనారాయణ తిరిగి అమరావతిలో విలువైన స్థలం కూడా ప్రభుత్వం వద్ద తీసుకున్నారన్నారు.
కావాలనే చంద్రబాబు… ఈ సత్యనారాయణను తెచ్చి పెట్టుకున్నారని ఆరోపించారు. వెంటనే అతడిని పోస్టు నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై ఆధార్ సంస్థ విచారణ జరపాలన్నారు.