Telugu Global
NEWS

ఏపీ ప్రజలంతా మీ పాస్‌వర్డ్‌లు మార్చుకోండి....

ఏపీ ప్రజల వ్యక్తిగత వివరాలతో కూడిన డేటాను ప్రైవేట్‌ సంస్థలకు ఏపీ ప్రభుత్వం అప్పగించిన వ్యవహారం సంచలంగా మారింది. ప్రజల బ్యాంకు ఖాతాల వ్యవహారాలు కూడా ప్రైవేట్‌ ఐటీ సంస్థకు చేరిన నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనని ఆందోళన చెందుతున్నారు. ఈ అంశంపై వెంటనే న్యాయస్థానాలు, ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని వైసీపీ ఎమ్మెల్సీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కుంభకోణానికి కారణమైన ఐటీ గ్రిడ్స్‌ సంస్థ నిర్వాహకులు నిత్యం చంద్రబాబు పేషీలో కనిపిస్తుంటారని చెప్పారు. దీని […]

ఏపీ ప్రజలంతా మీ పాస్‌వర్డ్‌లు మార్చుకోండి....
X

ఏపీ ప్రజల వ్యక్తిగత వివరాలతో కూడిన డేటాను ప్రైవేట్‌ సంస్థలకు ఏపీ ప్రభుత్వం అప్పగించిన వ్యవహారం సంచలంగా మారింది. ప్రజల బ్యాంకు ఖాతాల వ్యవహారాలు కూడా ప్రైవేట్‌ ఐటీ సంస్థకు చేరిన నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనని ఆందోళన చెందుతున్నారు. ఈ అంశంపై వెంటనే న్యాయస్థానాలు, ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని వైసీపీ ఎమ్మెల్సీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

కుంభకోణానికి కారణమైన ఐటీ గ్రిడ్స్‌ సంస్థ నిర్వాహకులు నిత్యం చంద్రబాబు పేషీలో కనిపిస్తుంటారని చెప్పారు. దీని వెనుక ముమ్మాటికి చంద్రబాబు హస్తముందన్నారు. ప్రజలకు తెలియకుండా వారి సమాచారాన్ని ప్రభుత్వమే ప్రైవేట్ సంస్థకు అప్పగించడం పెద్ద నేరమన్నారు.

కేవలం ఎన్నికల సంఘం వద్ద మాత్రమే ఉండాల్సిన కలర్‌ ఫొటోలు టీడీపీ యాప్‌లోకి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఒకవేళ టీడీపీ నేరం చేసి ఉండకపోతే సేవా మిత్రా యాప్‌లో హఠాత్తుగా ఇప్పుడే ఎందుకు మార్పులు చేశారని ప్రశ్నించారు. టీడీపీ ఓట్లు తీసే ధైర్యం ఏపీలో ఎవరికైనా ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు తమను బతకనిస్తే చాలు అని ఇతర పార్టీల వారు, ప్రజలు అనుకునే పరిస్థితి వచ్చిందన్నారు.

చంద్రబాబు, లోకేష్ చేసిన పని వల్ల సేవా మిత్రా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న టీడీపీ కార్యకర్తలకు కూడా పెద్ద ముప్పు ఉందన్నారు. యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న కార్యకర్తలు ఫోన్‌లో ఏం చూసినా, ఏం మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా, బ్యాంకు లావాదేవీలు జరిపినా అవన్నీ పార్టీ పెద్దలకు తెలిసిపోతున్నాయన్నారు.

దీని వల్ల టీడీపీ కార్యకర్తలు తమ వ్యక్తిగత వివరాలన్నీ పెద్దల చేతిలో పెట్టేశారన్నారు. ఏపీ ప్రజల డేటా మొత్తం టీడీపీ వాళ్లు బజారులో పెట్టేశారని.. కాబట్టి ఏపీ ప్రజలు వెంటనే తమకు సంబంధించి అన్ని పాస్‌వర్డ్‌లు మార్చుకోవడం చాలా ముఖ్యమని బుగ్గన సూచించారు. ఫేస్‌బుక్‌ నుంచి బ్యాంకు అకౌంట్‌ వరకు అన్ని పాస్‌వర్డ్‌లను తక్షణం మార్చుకోవాలని బుగ్గన ప్రజలకు సలహా ఇచ్చారు.

First Published:  4 March 2019 7:28 AM IST
Next Story