Telugu Global
National

జాతీయ స్థాయిలో తమ వైఖరిని స్పష్టం చేసిన జగన్

తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారు వైఎస్ జగన్‌. ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే 18వ ఎడిషన్ కాంక్లేవ్ లో ప్రసంగించిన జగన్… తాము బీజేపీకి, కాంగ్రెస్‌కు సమదూరం పాటిస్తున్నట్టు చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తూ సంతకం పెట్టిన ఏ పార్టీకైనా మద్దతు ఇస్తామన్నారు. మీరు హోదా ఇవ్వండి.. మేం మద్దతు ఇస్తాం అన్నదే తమ నినాదం అని చెప్పారు. ఏపీలో కాంగ్రెస్ ఆవిరైపోయిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఏపీపై ఎలాంటి ఆశలు లేవని జగన్ వ్యాఖ్యానించారు. […]

జాతీయ స్థాయిలో తమ వైఖరిని స్పష్టం చేసిన జగన్
X

తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారు వైఎస్ జగన్‌. ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే 18వ ఎడిషన్ కాంక్లేవ్ లో ప్రసంగించిన జగన్… తాము బీజేపీకి, కాంగ్రెస్‌కు సమదూరం పాటిస్తున్నట్టు చెప్పారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తూ సంతకం పెట్టిన ఏ పార్టీకైనా మద్దతు ఇస్తామన్నారు. మీరు హోదా ఇవ్వండి.. మేం మద్దతు ఇస్తాం అన్నదే తమ నినాదం అని చెప్పారు. ఏపీలో కాంగ్రెస్ ఆవిరైపోయిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఏపీపై ఎలాంటి ఆశలు లేవని జగన్ వ్యాఖ్యానించారు.

చంద్రబాబును అత్యంత అవినీతిపరుడైన ముఖ్యమంత్రిగా జగన్ అభివర్ణించారు. ముఖ్యమంత్రి కాగానే రాజధాని ఎక్కడ పెట్టాలో ముందే నిర్ణయించుకున్న చంద్రబాబు ప్రజలను తప్పుదారి పట్టించి… తాను, తన బినామీలు కలిసి అమరావతిలో తక్కువ ధరకే భూములు కొల్లగొట్టారన్నారు. అలా రైతుల నుంచి భూములు తీసుకున్న తర్వాతే రాజధానిని ప్రకటించి చంద్రబాబు ప్రజలను మోసం చేశారన్నారు జగన్. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఒక భారీ కుంభకోణానికి వేదిక అవడం దురదృష్టకరమన్నారు.

జాతీయ రాజకీయాల్లో తమది తటస్త వైఖరి అని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల గురించే తాము ఆలోచిస్తున్నట్టు జగన్ చెప్పారు. ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని మోడీ కూడా చెప్పారని… కాబట్టి ఆ మాట నిలబెట్టుకోవాల్సిందిగా మోడీని డిమాండ్ చేస్తున్నామన్నారు.

చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి సిటీలు ఉన్న పక్క రాష్ట్రాలతో ఏపీ పోటీ పడలేకపోతోందన్నారు. కేంద్రం హోదా ఇచ్చి… 100 శాతం రాయితీలు ఇస్తేనే ఏపీ పోటీ పడగలుగుతుందన్నారు. చంద్రబాబు అవినీతిపై ఆరు నెలల క్రితం ఇదే కాంగ్రెస్ పార్టీ ఒక పుస్తకాన్ని కూడా ప్రచురించిందని… దానిపై రాహుల్‌ గాంధీ బొమ్మ కూడా ఉందని జగన్ గుర్తు చేశారు.

ఇప్పుడు అదే కాంగ్రెస్‌- టీడీపీ కలిసిపోయాయన్నారు. తెలంగాణలో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్, టీడీపీని ప్రజలు చిత్తుగా ఓడించి పంపించారన్నారు. తన తండ్రి ఉన్నంత కాలం, తాను కాంగ్రెస్‌లో ఉన్నంత కాలం తనపై కేసులు పెట్టలేదని… ఎప్పుడైతే తాను కాంగ్రెస్‌ వీడుతున్నానని తెలియగానే కాంగ్రెస్, టీడీపీ నేతలు కలిసి కేసులు వేశారన్నారు జగన్‌. గడిచిన తొమ్మిదేళ్లలో తను అత్యధిక కాలం ప్రజల మధ్యనే గడిపానని జగన్‌ చెప్పారు.

తెలంగాణలో ఎమ్మెల్యేలను కొంటూ నల్లధనంతో ఆడియో, వీడియో టేపులతో సహా దొరికిపోయిన ముఖ్యమంత్రి దేశంలో చంద్రబాబు కాకుండా మరొకరు ఉన్నారా? అని జగన్‌ ప్రశ్నించారు.

First Published:  2 March 2019 7:43 AM IST
Next Story