బాబుపై మోహన్ బాబు ఫైర్
చంద్రబాబు ప్రభుత్వంపై నటుడు మోహన్ బాబు మరోసారి విరుచుకుపడ్డారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయకపోవడంతో మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. భిక్షం వేసినట్టుగా ప్రభుత్వం ఫీజులను చెల్లిస్తోందని మండిపడ్డారు. ఇలా ఇంకా ఎంతకాలం ఓర్చుకోవాలని ప్రశ్నించారు. విద్యార్థులకు ఇచ్చిన హామీలను చంద్రబాబు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే ఫీజులు చెల్లించాలని కోరారు. ఒక శ్రీవిద్యానికేతన్ కాలేజీకే ప్రభుత్వం 19 కోట్లు అప్పు ఉందన్నారు మోహన్ బాబు. అప్పులు పేరుకుపోవడంతో కాలేజీల నిర్వాహణకు తన ఆస్తులను తాకట్టు […]
చంద్రబాబు ప్రభుత్వంపై నటుడు మోహన్ బాబు మరోసారి విరుచుకుపడ్డారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయకపోవడంతో మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
భిక్షం వేసినట్టుగా ప్రభుత్వం ఫీజులను చెల్లిస్తోందని మండిపడ్డారు. ఇలా ఇంకా ఎంతకాలం ఓర్చుకోవాలని ప్రశ్నించారు. విద్యార్థులకు ఇచ్చిన హామీలను చంద్రబాబు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే ఫీజులు చెల్లించాలని కోరారు.
ఒక శ్రీవిద్యానికేతన్ కాలేజీకే ప్రభుత్వం 19 కోట్లు అప్పు ఉందన్నారు మోహన్ బాబు. అప్పులు పేరుకుపోవడంతో కాలేజీల నిర్వాహణకు తన ఆస్తులను తాకట్టు పెట్టాల్సి వస్తోందని ఆవేదన చెందారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా వైఎస్ ప్రజలకు ఎంతో మేలు చేశారని.. కానీ ఇప్పుడా పథకాన్ని నీరు గారుస్తున్నారని మండిపడ్డారు. బకాయిలపై అనేక సార్లు చంద్రబాబుకు లేఖ రాసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. తాను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదని మోహన్ బాబు చెప్పారు.