Telugu Global
National

 బాబు రాకూడదు.... విమర్శలు పెంచండి: మోడీ

“ రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీ అధికారం లోకి రాకూడదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇరుకున పడేలా విమర్శలు పెంచండి” నరేంద్ర మోడీ వ్యాఖ్యలు ఇవి. విశాఖపట్నంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొనేందుకు విశాఖకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభా వేదిక పైనా, విమానాశ్రయంలోనూ…. ఆంధ్ర ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.  కేవలం 15 నిమిషాలు మాత్రమే సమావేశమైన నరేంద్ర […]

 బాబు రాకూడదు.... విమర్శలు పెంచండి: మోడీ
X

“ రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీ అధికారం లోకి రాకూడదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇరుకున పడేలా విమర్శలు పెంచండి” నరేంద్ర మోడీ వ్యాఖ్యలు ఇవి.

విశాఖపట్నంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొనేందుకు విశాఖకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభా వేదిక పైనా, విమానాశ్రయంలోనూ…. ఆంధ్ర ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. కేవలం 15 నిమిషాలు మాత్రమే సమావేశమైన నరేంద్ర మోడీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పరాజయమే లక్ష్యంగా పని చేయాలని రాష్ట్ర నాయకులకు స్పష్టం చేసినట్లు సమాచారం.

గడచిన నాలుగున్నర సంవత్సరాలుగా భారతీయ జనతాపార్టీతో చెలిమి చేసి ఇప్పుడు మనల్ని గద్దె దించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని చంద్రబాబు నాయుడిపై విరుచుకుపడ్డట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలన్నింటినీ తమ పథకాలుగా చంద్రబాబు నాయుడు ప్రచారం చేసుకుంటున్నారని, దీనికి అడ్డుకట్ట వేసి ఆంధ్రప్రదేశ్ లో మన పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని ప్రధాని నరేంద్ర మోడీ బిజెపి రాష్ట్ర నాయకులకు సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

“తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి , ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో భారతీయ జనతా పార్టీ జత కడుతుంది అంటూ చంద్రబాబునాయుడు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. దీనిపై వాస్తవాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు స్పష్టంగా చెప్పాలి” అని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ కమలనాథులకు స్పష్టం చేసినట్టు చెబుతున్నారు.

తమకు అందిన నివేదికల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించలేదని, అయితే చంద్రబాబును మాత్రం తక్కువ అంచనా వేయకుండా ఆయన అసలు స్వరూపాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర నాయకులతో అన్నట్లు సమాచారం.

రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు పతనమే లక్ష్యంగా పని చేయాలి, ఇందుకోసం తగిన వ్యూహాన్ని రూపొందించాలని ప్రధాని నరేంద్ర మోడీ కమలనాథులకు సూచించినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.

First Published:  2 March 2019 3:04 AM IST
Next Story