ఏరాసుకు ఎసరొచ్చింది...
టీడీపీలో మరో సీనియర్ నేత సీటుకు ఎసరొచ్చింది. కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత దంపతులు వైసీపీకి రాజీనామా చేశారు. టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. చరితకు మరోసారి పాణ్యం టికెట్‌ను చంద్రబాబు ఖాయం చేశారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. గత ఎన్నికల్లో పాణ్యం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన ఏరాసు అనంతరం… నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్నారు. ఇప్పుడు గౌరు చరితకు పాణ్యం టికెట్ ఇస్తుండడంతో ఏరాసుకు టికెట్ లేనట్టేనని చెబుతున్నారు. ఇంతకాలం […]

టీడీపీలో మరో సీనియర్ నేత సీటుకు ఎసరొచ్చింది. కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత దంపతులు వైసీపీకి రాజీనామా చేశారు. టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. చరితకు మరోసారి పాణ్యం టికెట్‌ను చంద్రబాబు ఖాయం చేశారు.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. గత ఎన్నికల్లో పాణ్యం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన ఏరాసు అనంతరం… నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్నారు. ఇప్పుడు గౌరు చరితకు పాణ్యం టికెట్ ఇస్తుండడంతో ఏరాసుకు టికెట్ లేనట్టేనని చెబుతున్నారు.
ఇంతకాలం పార్టీ కోసం పనిచేస్తే తీరా ఎన్నికల సమయంలో తమను పక్కన పెట్టడంపై ఏరాసు వర్గం అసంతృప్తిగా ఉంది. గౌరు
చరిత కుటుంబం పార్టీలోకి వస్తోందని అందరూ కలిసి పనిచేయాలని ఇటీవల ఏరాసు ప్రతాప్ రెడ్డికి పది రోజుల క్రితమే చెప్పిన చంద్రబాబు… మిగిలిన అంశాలపై తర్వాత మాట్లాడుదాం అంటూ దాటవేశారట. ఇప్పటికీ ఏరాసు భవిష్యత్తుపై చంద్రబాబు నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు.