Telugu Global
NEWS

యుద్ధం చేస్తే ఓట్లు రావు.... ప్రజలను కాపాడితే వస్తాయి

ఎన్నికల ముందు యుద్ధం వస్తుందని పవన్‌కి చెప్పారు అభినందన్ విషయంలో కూడా రాజకీయాలు చేశారు కేసీఆర్ ఏపీకి వచ్చి రాజకీయాలు చేస్తే గుణపాఠం చెప్తాం కొడుమూరు సభలో చంద్రబాబు టీడీపీలో చేరిన కోట్ల సూర్యప్రకాశ్ దంపతులు ఎన్నికల ముందు యుద్ధం చేస్తే ఓట్లు వస్తాయా..? ప్రజలను కాపాడితే ఓట్లేస్తారో..? ప్రధాని నరేంద్ర మోడీ తేల్చుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి సతీసమేతంగా ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరారు. […]

యుద్ధం చేస్తే ఓట్లు రావు.... ప్రజలను కాపాడితే వస్తాయి
X
  • ఎన్నికల ముందు యుద్ధం వస్తుందని పవన్‌కి చెప్పారు
  • అభినందన్ విషయంలో కూడా రాజకీయాలు చేశారు
  • కేసీఆర్ ఏపీకి వచ్చి రాజకీయాలు చేస్తే గుణపాఠం చెప్తాం
  • కొడుమూరు సభలో చంద్రబాబు
  • టీడీపీలో చేరిన కోట్ల సూర్యప్రకాశ్ దంపతులు

ఎన్నికల ముందు యుద్ధం చేస్తే ఓట్లు వస్తాయా..? ప్రజలను కాపాడితే ఓట్లేస్తారో..? ప్రధాని నరేంద్ర మోడీ తేల్చుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి సతీసమేతంగా ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కొడుమూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ….

నిన్న, మొన్న ఇక్కడ పవన్ కళ్యాణ్ పర్యటించినప్పుడు రెండేళ్ల క్రితమే బీజేపీ నాయకులు నాకు ఎన్నికల ముందు యుద్ధం వస్తుందని చెప్పారని వెల్లడించారు. నరేంద్ర మోడీ ఇలా దేశవ్యాప్తంగా భయ భ్రాంతులకు గురి చేసి ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.

మోడీ, కేసీఆర్, జగన్ లు కలిసి ఏపీని నాశనం చేయడానికి చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఖబర్ధార్ కేసీఆర్.. ఏపీకి నష్టం కలిగిస్తే తగిన గుణపాఠం చెబుతామని ఆయన హెచ్చరించారు.

అభినందన్ విషయంలో కూడా మోడీ రాజకీయాలు చేశారని బాబు దుయ్యబట్టారు. ఆ దేశభక్తుడు ఇండియాకు తిరిగి వస్తుంటే ఈయన స్వాగతం పలకడానికి వెళ్లరా? అని మోడీని ప్రశ్నించారు. పుల్వామా దాడి మోడీ ప్రభుత్వ వైఫల్యం వల్లే జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. మోడీ విశాఖలో సభ పెట్టుకోవడానికే ప్రత్యేక జోన్ ప్రకటించారని.. ఆదాయం అంతా ఒడిషాకు ఇచ్చి ఆదాయం లేని, డివిజన్ లేని విశాఖ జోన్ ప్రకటించారని ఆయన విమర్శించారు.

మరోవైపు ప్రత్యేక హోదా గురించి, విశాఖ జోన్‌కు జరిగిన అన్యాయం గురించి వైసీపీ ఎందుకు ప్రశ్నించదని ఆయన అన్నారు. జగన్‌కు ఓటేస్తే మోడీకి ఓటేసినట్లేనని, జగన్‌కు ప్రశాంత్ కిశోర్ అనే బీహారి కన్సల్టెంట్‌గా ఉన్నారన్నారు. ఆయనకు ఇక్కడి రాజకీయాలు ఏం తెలుసు? ఆ ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లు జగన్ చేస్తాడు.. ఏదో ఒక రోజు దీన్ని బీహార్‌లా మారుస్తారా? అని బాబు ప్రశ్నించారు. ఇక విజయసాయి రెడ్డి ఏపీలో పుట్టి, ఇక్కడ ఓట్లు అడిగి పిర్యాదులు మాత్రం తెలంగాణలో చేస్తుంటారని ఎద్దేవా చేశారు.

ఏపీని నెంబర్ వన్ చేసేది నేనే అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఎన్నో కొత్త పథకాలు ప్రవేశపెట్టామని.. పింఛన్లు పెంచామని చంద్రబాబు వెల్లడించారు. రాయలసీమను హార్టీకల్చరల్ హబ్‌గా మారుస్తామని బాబు హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లాకు సాగునీటి సరఫరా కోసమని బాగేపల్లి ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేశామని బాబు చెప్పారు.

అంతకు మునుపు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, ఆయన భార్య కోట్ల సుజాతతో పాటు ఆయన అనుచరులను కండువా కప్పి టీడీపీలోనికి ఆహ్వానించారు. కేఈ మాదన్న, కోట్ల విజయభాస్కర రెడ్డి సంస్కారవంతమైన రాజకీయాలు చేశారని చెప్పారు. ఈ ఇరు కుటుంబాలు ఒకే వేదికను పంచుకోవడం ఒక చారిత్రాత్మక ఘటన అని ఆయన అన్నారు. తాను కోట్ల సీఎంగా ఉన్నప్పుడు ఆయన కేబినెట్‌లో పని చేశానని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కర్నూలు జిల్లాలోని రెండు పార్లమెంటు, అన్ని అసెంబ్లీ స్థానాలు గెలిపించాలని ఆయన కోరారు.

First Published:  2 March 2019 7:16 AM GMT
Next Story