అమరావతిలో కూలిన తాత్కాలిక హైకోర్టు జనరేటర్ గదులు
అమరావతిలో నిర్మిస్తున్న తాత్కాలిక హైకోర్టు నిర్మాణంలోనూ డొల్లతనం బయటపడింది. ఇప్పటికే విదేశీ సంకేతిక పరిజ్ఞానంతో కట్టామని చెప్పుకుంటున్న అసెంబ్లీ, సచివాలయం వర్షం వస్తే చాలు చెరువవుతోంది. తాజాగా హైకోర్టు నిర్మాణంలోనూ నాణ్యత లోపించింది. హైకోర్టులో భాగంగా నిర్మించిన జనరేటర్ గది కూలిపోయింది. ఆరు గదులు నిర్మిస్తుండగా రెండు గదుల స్లాబ్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ విషయం బయటకు తెలిస్తే పరువుపోతుందన్న ఉద్దేశంతో గోప్యంగా ఉంచారు. కూలిన గదుల వద్దకు మీడియా వెళ్లకుండా నిషేధం విధించారు. […]
అమరావతిలో నిర్మిస్తున్న తాత్కాలిక హైకోర్టు నిర్మాణంలోనూ డొల్లతనం బయటపడింది. ఇప్పటికే విదేశీ సంకేతిక పరిజ్ఞానంతో కట్టామని చెప్పుకుంటున్న అసెంబ్లీ, సచివాలయం వర్షం వస్తే చాలు చెరువవుతోంది. తాజాగా హైకోర్టు నిర్మాణంలోనూ నాణ్యత లోపించింది.
హైకోర్టులో భాగంగా నిర్మించిన జనరేటర్ గది కూలిపోయింది. ఆరు గదులు నిర్మిస్తుండగా రెండు గదుల స్లాబ్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ విషయం
బయటకు తెలిస్తే పరువుపోతుందన్న ఉద్దేశంతో గోప్యంగా ఉంచారు.
కూలిన గదుల వద్దకు మీడియా వెళ్లకుండా నిషేధం విధించారు. మీడియా ప్రతినిధులు అటుగా వెళ్లకుండా పోలీసులను మోహరించారు.