తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించిన జగన్
సార్వత్రిక ఎన్నికలకు సిద్దంగా ఉండాలని పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లతో సమావేశం నిర్వహించిన జగన్… ఈ 45 రోజులు అత్యంత కీలకమని వ్యాఖ్యానించారు. తొమ్మిదేళ్ల పాటు చేసిన తరహాలోనే ఈ 45 రోజులు పోరాటాలు సాగించాలని సూచించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన వెంటనే తన బస్సు యాత్ర ప్రారంభమవుతుందని జగన్ ప్రకటించారు. షెడ్యూల్ వచ్చిన ఒకటి రెండు రోజుల్లోనే అభ్యర్థులను ప్రకటిస్తామని జగన్ చెప్పారు. నియోజకవర్గాల్లో ఎన్నికల ఇన్‌చార్జ్‌లను నియమిస్తామని…. పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యతను ఇన్‌చార్జ్‌లు స్వీకరించాలని కోరారు. వైసీపీతో […]
సార్వత్రిక ఎన్నికలకు సిద్దంగా ఉండాలని పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లతో సమావేశం నిర్వహించిన జగన్… ఈ 45 రోజులు అత్యంత కీలకమని వ్యాఖ్యానించారు. తొమ్మిదేళ్ల పాటు చేసిన తరహాలోనే ఈ 45 రోజులు పోరాటాలు సాగించాలని సూచించారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన వెంటనే తన బస్సు యాత్ర ప్రారంభమవుతుందని జగన్ ప్రకటించారు. షెడ్యూల్ వచ్చిన ఒకటి రెండు రోజుల్లోనే అభ్యర్థులను ప్రకటిస్తామని జగన్ చెప్పారు. నియోజకవర్గాల్లో ఎన్నికల ఇన్‌చార్జ్‌లను నియమిస్తామని…. పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యతను ఇన్‌చార్జ్‌లు స్వీకరించాలని కోరారు.
వైసీపీతో కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరినీ కలుపుకుపోవాలని సూచించారు. రాష్ట్రంలో ధ్వంసమైన వ్యవస్థలు తిరిగి నిలబడాలంటే వైసీపీ అధికారంలోకి రావడమే మార్గమన్నారు. ఈ సమావేశంలో ప్రశాంత్ కిషోర్ కూడా పాల్గొన్నారు.
ఢిల్లీకి జగన్…
మరో వైపు వైఎస్ జగన్ నేడు ఢిల్లీ వెళ్తున్నారు. ఇండియా టుడే చానల్ నిర్వహించే సదస్సులో పాల్గొంటారు. ఢిల్లీ పీఠంపై ఎవరు కూర్చోవాలన్న విషయంలో దక్షిణాది పాత్ర ఎలా ఉంటుందన్న అంశంపై జగన్ మాట్లాడనున్నారు.