ఇండియాలో అడుగుపెట్టిన అభినందన్.. దేశవ్యాప్తంగా సంబరాలు
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను వాఘా సరిహద్దు వద్ద పాకిస్తాన్ అధికారులు భారత వాయుసేన అధికారులకు అప్పగించారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకే లాహోర్ నుంచి పటిష్ట భద్రత నడుమ అటారీ – వాఘా సరిహద్దు వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్ చెక్ పాయింట్ వద్దకు తరలించారు. అయితే ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ పూర్తికావడానికి దాదాపు 6 గంటల సమయం పట్టింది. సరిగ్గా రాత్రి 9.30 గంటలకు వాఘా సరిహద్దు గేట్లు తెరుచుకోగా సూటు ధరించి ఎంతో […]
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను వాఘా సరిహద్దు వద్ద పాకిస్తాన్ అధికారులు భారత వాయుసేన అధికారులకు అప్పగించారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకే లాహోర్ నుంచి పటిష్ట భద్రత నడుమ అటారీ – వాఘా సరిహద్దు వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్ చెక్ పాయింట్ వద్దకు తరలించారు. అయితే ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ పూర్తికావడానికి దాదాపు 6 గంటల సమయం పట్టింది.
సరిగ్గా రాత్రి 9.30 గంటలకు వాఘా సరిహద్దు గేట్లు తెరుచుకోగా సూటు ధరించి ఎంతో నిబ్బరంగా ఉన్న అభినందన్ భారత గడ్డపై అడుగుపెట్టాడు. దీంతో గంటల తరబడి వాఘా వద్ద ఎదురు చూస్తున్న భారతీయులు చప్పట్లు, కేకలతో కేరింతలు కొట్టారు. అభినందన్‌ను సగర్వంగా ఆహ్వానించారు. అభినందన్ అడుగుపెట్టిన వెంటనే భారత ఐఏఎఫ్, ఆర్మీ వాహనాల్లో అతడిని వెంటనే అమృత్‌సర్‌కు తరలించారు. రేపు అభినందన్‌కు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని ఐఏఎఫ్ వైస్ మార్షల్ ఆర్‌జీకే కపూర్ వెల్లడించారు.
ఇక అభినందన్ రాకతో దేశవ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన అభి.. క్షేమంగా తిరిగి రావడంతో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. జైహింద్, భారత్ మాతాకీ జై, భరత మాత ముద్దుబిడ్డకు జై అంటూ నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు.