మంత్రి గంటాకు ఎర్త్ పెట్టిన లోకేష్ !
ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్ ఎక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న లోకేష్‌కు సీటు అవసరం పడింది. గత కొన్ని రోజులుగా తాను పోటీ చేసే సీటు కోసం లోకేష్ తీవ్రంగా వెతుకుతున్నారు. కానీ గెలిచే సేఫ్ సీటు మాత్రం దొరకడం లేదు. గత కొన్నాళ్లుగా చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం నియోజకవర్గం నుంచి లోకేష్ పోటీ చేస్తారని టీడీపీ నేతలు లీకులు ఇచ్చారు. చంద్రబాబుకు […]
ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్ ఎక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న లోకేష్‌కు సీటు అవసరం పడింది. గత కొన్ని రోజులుగా తాను పోటీ చేసే సీటు కోసం లోకేష్ తీవ్రంగా వెతుకుతున్నారు. కానీ గెలిచే సేఫ్ సీటు మాత్రం దొరకడం లేదు.
గత కొన్నాళ్లుగా చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం నియోజకవర్గం నుంచి లోకేష్ పోటీ చేస్తారని టీడీపీ నేతలు లీకులు ఇచ్చారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని…ఆయన వేరే నియోజకవర్గం నుంచి బరిలో ఉంటారని చెప్పుకొచ్చారు. నారావారికి కలిసివచ్చిన కుప్పం నుంచి లోకేష్ బరిలో ఉంటారని ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు ఆ సీటును వదులుకునేందుకు చంద్రబాబు ఇష్టపడడం లేదని తెలుస్తోంది. తనయుడి కోసం తన సీటు ఆయన త్యాగం చేసే పరిస్థితి కనిపించడం లేదు. కుప్పం నుంచే మళ్లీ చంద్రబాబు పోటీ చేయబోతున్నారనే క్లారిటీ మాత్రం ఇచ్చారు.
చంద్రబాబు కుప్పం సీటు వదులుకోవడం లేదు. దీంతో లోకేష్‌కు సీటు టెన్షన్ పట్టుకుంది. ఎక్కడి నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయని 173 సీట్లను వెతుకుతున్నారు. కృష్ణాజిల్లా పెనమలూరు నుంచి పోటీ చేస్తారని ఒకసారి లీకులు ఇస్తే… తిరుపతి నుంచి పోటీ చేస్తారని మరొకసారి చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఉత్తరాంధ్ర వైపు ఆయన చూస్తున్నారని తెలుగుదేశం అనుకూల మీడియాలో కథనాలను బట్టి తెలుస్తోంది.
మంత్రి గంటా శ్రీనివాసరావు గత ఎన్నికల్లో గెలిచిన భీమిలి నుంచి లోకేష్ పోటీ చేస్తారని వార్తలు విన్పిస్తున్నాయి. భీమిలి సీటు లోకేష్‌కు ఇచ్చి గంటా విశాఖ నార్త్ నుంచి బరిలో ఉంటారని తెలుగుదేశం అనుకూల మీడియాలో కథనం ద్వారా తెలుస్తోంది.
అయితే ఎన్నికల్లో గెలుపు కోసం నియోజకవర్గాలు మార్చే మంత్రి గంటా అలవాటే లోకేష్‌కు కూడా వచ్చిందని తెలుగుదేశం తమ్ముళ్లు గుసగుసలాడుతున్నారు.