నారా లోకేష్.... పోటీపై ప్రకటన లేనిది అందుకేనట!
ఒకవైపు ముసలీముతక నేతలు కూడా ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసి ఎన్నికలను ఎదుర్కొంటామని ప్రకటిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీలోని నేతలే అలా ప్రకటిస్తూ ఉన్నారు. తెలుగుదేశం ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇప్పటికే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాడు. తను ఎమ్మెల్యే ఎన్నికను సీరియస్ గా తీసుకునేందుకే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్టుగా సోమిరెడ్డి ప్రకటించాడు. అయితే నారాలోకేష్ లో మాత్రం అలాంటి సీరియస్ నెస్ ఏమీ కనిపించడం లేదు. ఇప్పటి వరకూ ఎమ్మెల్సీ పదవికి నారా […]
ఒకవైపు ముసలీముతక నేతలు కూడా ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసి ఎన్నికలను ఎదుర్కొంటామని ప్రకటిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీలోని నేతలే అలా ప్రకటిస్తూ ఉన్నారు. తెలుగుదేశం ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇప్పటికే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాడు. తను ఎమ్మెల్యే ఎన్నికను సీరియస్ గా తీసుకునేందుకే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్టుగా సోమిరెడ్డి ప్రకటించాడు.
అయితే నారాలోకేష్ లో మాత్రం అలాంటి సీరియస్ నెస్ ఏమీ కనిపించడం లేదు. ఇప్పటి వరకూ ఎమ్మెల్సీ పదవికి నారా లోకేష్ రాజీనామా చేయలేదు. అలాగే ఎక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్న అంశాన్ని కూడా ప్రకటించలేదు. అసలు నారా లోకేష్ పోటీ చేస్తాడా లేదా.. అనే అంశం పై కూడా క్లారిటీ లేదు. ఒకవేళ ఈ సారి నారా లోకేష్ ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఆయన రాజకీయ జీవితం మరింతగా నవ్వులపాలవుతుంది.
తొలిసారి మంత్రి పదవి తీసుకున్నప్పుడే లోకేష్ ఎమ్మెల్సీ పదవిని ఎంచుకోవడం విమర్శలకు దారి తీసింది. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా లోకేష్ ఎమ్మెల్సీగా నామినేట్ కావడం ఏమిటని అనేక మంది విమర్శలు చేశారు. అయితే లోకేష్ మాత్రం ఆ వెక్కిరింపులు తనకు వినపడనట్టుగా వ్యవహరించాడు. వాటితో తనకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. పైపెచ్చూ తను మంత్రి కావడం అనేది అదో పెద్ద ఘనత అని లోకేష్ చెప్పుకుంటున్నాడు.
లోకేష్ తీరును చూస్తుంటే మాత్రం ఆయన ఈ సారి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయకపోయినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదని పరిశీలకులు అంటున్నారు. అయితే నారా లోకేష్ పోటీ చేస్తాడని.. ముందుగానే నియోజకవర్గాన్ని ప్రకటిస్తే.. ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్టుగా అవుతుందని కామ్ గా ఉన్నారని తెలుగుదేశం వాళ్లు ప్రచారం చేస్తూ ఉన్నారు!