Telugu Global
NEWS

అవినీతి సామ్రాజ్యం కోసం అబద్ధాలు : మోదీ

“రాత్రింబవళ్లు అబద్ధాలతో కాలం గడుపుతున్న వారు, కుటుంబ పాలన కావాలని అనుకునేవారు… అవినీతి సామ్రాజ్యాన్ని స్ధాపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు” అని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. విశాఖపట్నంలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పేరు ప్రస్తావించకుండా తీవ్ర విమర్శలు చేసారు. యూ టర్న్‌ తీసుకోవడంలో సిద్దహస్తులైన వారు కేంద్రంలో తమను అధికారం నుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసిన వారితో చేతులు కలిపేందుకు […]

అవినీతి సామ్రాజ్యం కోసం అబద్ధాలు : మోదీ
X

“రాత్రింబవళ్లు అబద్ధాలతో కాలం గడుపుతున్న వారు, కుటుంబ పాలన కావాలని అనుకునేవారు… అవినీతి సామ్రాజ్యాన్ని స్ధాపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు” అని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ.

విశాఖపట్నంలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పేరు ప్రస్తావించకుండా తీవ్ర విమర్శలు చేసారు. యూ టర్న్‌ తీసుకోవడంలో సిద్దహస్తులైన వారు కేంద్రంలో తమను అధికారం నుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసిన వారితో చేతులు కలిపేందుకు సైతం వారు వెనుకాడడం లేదని చంద్రబాబును ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు. తాము అభ్యున్నత కోసం పనిచేస్తున్నామని, ఇక్కడి నాయకులు మాత్రం అవినీతి కోసం పనిచేస్తున్నారని అన్నారు. తమ మనుగడ కోసం ఎలాంటి అబ్దద్ధాలు చెప్పేందుకైనా వెనుకాడని నాయకులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారని, వారికి వారి కుటుంబ సంక్షేమం తప్ప ప్రజా సంక్షేమం పట్టదని విమర్శించారు.

ప్రధాని నరేంద్ర మోదీ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ “అందమైన విశాఖను చూస్తే నా మనసు పులకరిస్తుంది, ఇక్కడ వరాహలక్ష్మీ నరసింహ స్వామి కొలువై ఉన్నారు. విప్లవ వీరుడు అల్లూరి సీతరామరాజు నడయాడిన ప్రదేశం. తెన్నేటి విశ్వనాధం వంటి ప్రజానాయకులు ప్రాతినిత్యం వహించిన నగరం” అని ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరు ఎత్తకుండా ఎటువంటి ఆవేశకావేశాలకు లోనుకాకుండా తెలుగుదేశం పార్టీ పాలనపై విరుచుకుపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ది కోసం విశాఖ రైల్వే జోన్‌ ప్రకటించామని… దీని వల్ల వేలాది మందికి ఉద్యోగాలు రావడమే కాక పర్యాటకంగా కూడా ఉత్తరాంధ్ర ఎంతో అభివృద్ది చెందుతుందని అన్నారు.

తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని ఆ ప్రసంగాన్ని హిందీలో కొనసాగించారు. ఈ ప్రసంగాన్ని కేంద్ర మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అనువదించారు.

First Published:  1 March 2019 4:13 PM IST
Next Story