Telugu Global
National

అభినందన్ కోసం విమానం పంపుతామంటే నిరాకరించిన పాకిస్తాన్

పాకిస్తాన్ ఆర్మీకి పట్టుబడి ఇవాళ విడుదల కాబోతున్న ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ కోసం భారత ప్రభుత్వం ప్రత్యేక విమానాన్ని పంపాలని భావించింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ ప్రభుత్వానికి కూడా వెల్లడించింది. అయితే భారత్ ప్రతిపాదనను పాకిస్తాన్ తిరస్కరించింది. పారాచూట్ సహాయంతో కిందకు దిగిన అభినందన్ నడుముకు గాయాలయ్యాయి. అంతే కాకుండా పీవోకేలోని స్థానికుల దెబ్బలకు కూడా గాయాలవడం వీడియోలో కనిపించింది. ఈ నేపథ్యంలో విమానం పంపి వెంటనే అభినందన్‌ను ఢిల్లీ తీసుకొని వచ్చి ఆసుపత్రిలో […]

అభినందన్ కోసం విమానం పంపుతామంటే నిరాకరించిన పాకిస్తాన్
X

పాకిస్తాన్ ఆర్మీకి పట్టుబడి ఇవాళ విడుదల కాబోతున్న ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ కోసం భారత ప్రభుత్వం ప్రత్యేక విమానాన్ని పంపాలని భావించింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ ప్రభుత్వానికి కూడా వెల్లడించింది. అయితే భారత్ ప్రతిపాదనను పాకిస్తాన్ తిరస్కరించింది.

పారాచూట్ సహాయంతో కిందకు దిగిన అభినందన్ నడుముకు గాయాలయ్యాయి. అంతే కాకుండా పీవోకేలోని స్థానికుల దెబ్బలకు కూడా గాయాలవడం వీడియోలో కనిపించింది. ఈ నేపథ్యంలో విమానం పంపి వెంటనే అభినందన్‌ను ఢిల్లీ తీసుకొని వచ్చి ఆసుపత్రిలో చికిత్స చేయించాలని భారత ప్రభుత్వం భావించింది.

అంతే కాకుండా రోడ్డు మార్గం ద్వారా పంపితే అభినందన్ కోసం లక్షలాది మంది ప్రజలు వాఘా సరిహద్దుకు వచ్చే అవకాశం ఉండటం వల్ల భద్రతా సమస్యలు కూడా ఏర్పడతాయని ప్రభుత్వం భావించింది. అందుకే ఐఏఎఫ్‌కు చెందిన ప్రత్యేక విమానాన్ని పంపుతామని పాకిస్తాన్‌కు చెప్పింది. కాని ఈ ప్రతిపాదనను పాకిస్తాన్ తిరస్కరించడంతో వాఘా నుంచే ప్రత్యేక వాహనాల్లో అభినందన్‌ను తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మరోవైపు వాఘా సరిహద్దు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భరతమాత ముద్దు బిడ్డను సగర్వంగా స్వాగతించేందుకు లక్షలాది మంది అక్కడకు చేరుకున్నారు. ఐఏఎఫ్ బృందం కూడా వాఘా సరిహద్దుకు చేరుకుంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు అభినందన్‌ సరిహద్దు దాటే అవకాశం ఉంది. ఈరోజు ఉదయానికి అభినందన్ లాహోర్‌లో ఉన్నట్లు సమాచారం.

First Published:  1 March 2019 8:17 AM IST
Next Story