రైలు ప్రయాణికులకు శుభవార్త : ఇకపై ఏ బెర్త్ ఖాళీగా ఉందో ఆన్ లైన్ లో చూడొచ్చు..!
రైలు ప్రయాణం అంటే అదో ప్రహాసనం..! విమాన చార్జీలు దిగి వచ్చినా ఇప్పటికీ సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు దూర ప్రయాణాలకు రైలు మార్గాన్నే ఎంచుకుంటున్నారు. ముందే నిర్ణయించుకున్న ప్రయాణమైతే టికెట్లు రిజర్వ్ చేసుకొని సుఖంగా ప్రయాణం చేయవచ్చు. కాని అప్పటికప్పుడు ప్రయాణం, రిజర్వు చేసినా వెయిటింగ్‌లో ఉండే టెన్షన్ చెప్పనలవి కాదు. ఇక ట్రెయిన్‌లో బెర్తులు ఖాళీలు చూపించినా.. అవి ఎక్కడ ఉన్నాయో.. లేదా ఏ బెర్తు వస్తుందో టికెట్ బుక్ చేసే దాకా చెప్పడం కష్టమే. […]
రైలు ప్రయాణం అంటే అదో ప్రహాసనం..! విమాన చార్జీలు దిగి వచ్చినా ఇప్పటికీ సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు దూర ప్రయాణాలకు రైలు మార్గాన్నే ఎంచుకుంటున్నారు. ముందే నిర్ణయించుకున్న ప్రయాణమైతే టికెట్లు రిజర్వ్ చేసుకొని సుఖంగా ప్రయాణం చేయవచ్చు. కాని అప్పటికప్పుడు ప్రయాణం, రిజర్వు చేసినా వెయిటింగ్‌లో ఉండే టెన్షన్ చెప్పనలవి కాదు.
ఇక ట్రెయిన్‌లో బెర్తులు ఖాళీలు చూపించినా.. అవి ఎక్కడ ఉన్నాయో.. లేదా ఏ బెర్తు వస్తుందో టికెట్ బుక్ చేసే దాకా చెప్పడం కష్టమే. వీటన్నింటికీ చెక్ పెడుతూ ఇండియన్ రైల్వేస్ సరికొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టింది. రైల్వే టికెటింగ్ సైట్ ఐఆర్‌సీటీసీలో ఈ కొత్త ఆప్షన్ ప్రవేశపెట్టారు. దీన్ని ఇవాళ ఢిల్లీలో రైల్వే శాఖా మంత్రి పీయుష్ గోయల్ ప్రారంభించారు.
రైల్వే టికెట్ రిజర్వేషన్లలో మరింత పారదర్శకత తీసుకొని రావడానికే ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టామన్నారు. రైలు బయలుదేరడానికి నాలుగు గంటల ముందు నుంచి రైలు గమ్యస్థానం చేరే వరకు లైవ్‌లో ఆ రైలులో బెర్త్ ఖాళీలు చూపుతుందని ఆయన చెప్పారు.
ఇక టికెట్ కలెక్టర్‌ని బతిమలాడే పని లేదు..!
రైల్వే శాఖ ప్రవేశపెట్టిన ఈ టెక్నాలజీ చాలా వినూత్నమైనది. ట్రెయిన్ బయలు దేరడానికి నాలుగు గంటల ముందు తొలి చార్ట్ సిద్దం చేస్తారు. అప్పుడు ఫస్ట్ లైవ్ స్టార్ట్ అవుతుంది. ఏ బెర్త్ ఖాళీగా ఉందో గ్రాఫిక్స్ రూపంలో చూపిస్తారు. అలాగే ఆర్ఏసీ స్టేటస్ కూడా చూపెడతారు. ఇక అరగంట ముందు తయారయ్యే రెండో చార్ట్ కూడా లైవ్ వస్తుంది. ఈ మూడున్నర గంటల్లో ఎవరైనా టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే కొత్త ఖాళీలు ప్రత్యక్షం అవుతాయి.
మరోవైపు రైలు కదిలిన తర్వాత మనం ఎక్కడో ఒక దగ్గర ఆర్ఏసీ బెర్తులో కూర్చుంటాం. తర్వాత సీటు కావాలంటే పదేపదే టీసీ వెనుక పడాల్సిందే. ఇకపై చార్ట్స్ పెట్టే ప్రతీ స్టేషన్‌లో ఖాళీలు అప్‌డేట్ అవుతుంటే మనమే ఆ సీట్లు ఏవో తెలుసుకోవచ్చు. తద్వారా మనకు ఆ సీటు కేటాయించేలా టీసీని డిమాండ్ చేయవచ్చు.
ప్రస్తుతం శతాబ్ది, రాజధాని రైళ్లలో ఈ ఆప్షన్ ప్రవేశపెట్టారు. రానున్న రోజుల్లో అన్ని రైళ్లలో దీన్ని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.