Telugu Global
International

మణిరత్నం సినిమాకు సహకరించాడు.... చివరికి కొడుకు అలాగే పట్టుబడ్డాడు..!

జీవితం అంటే ఇలాగే ఉంటుంది భయ్యా..! ఎవరో సినిమా తీయడం ఏంటీ.. దానికి మరెవరో సాయం చేయడం ఏంటీ.. చివరికి సాయం చేసిన వ్యక్తి కొడుకు, ఆ సినిమాలో చూపించిన విధంగా యుద్ద ఖైదీగా మారడం ఏంటి..! ఇదే భయ్యా జీవితం అంటే..! అసలు విషయం చెప్పకుండా ఏంటీ ఉపోద్ఘాతం అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నా..! కార్గిల్ యుద్ద నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు మణిరత్నం 2017లో ‘కాట్రు వెలియిదయ్’ అనే సినిమా తీశాడు. తెలుగులో ‘చెలియా’ పేరుతో విడుదలైన […]

మణిరత్నం సినిమాకు సహకరించాడు.... చివరికి కొడుకు అలాగే పట్టుబడ్డాడు..!
X

జీవితం అంటే ఇలాగే ఉంటుంది భయ్యా..! ఎవరో సినిమా తీయడం ఏంటీ.. దానికి మరెవరో సాయం చేయడం ఏంటీ.. చివరికి సాయం చేసిన వ్యక్తి కొడుకు, ఆ సినిమాలో చూపించిన విధంగా యుద్ద ఖైదీగా మారడం ఏంటి..! ఇదే భయ్యా జీవితం అంటే..! అసలు విషయం చెప్పకుండా ఏంటీ ఉపోద్ఘాతం అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నా..!

కార్గిల్ యుద్ద నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు మణిరత్నం 2017లో ‘కాట్రు వెలియిదయ్’ అనే సినిమా తీశాడు. తెలుగులో ‘చెలియా’ పేరుతో విడుదలైన ఈ సినిమాలో కార్తి, అతిథి రావు హైదరి నటించారు. ఈ సినిమాలో కార్తి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) పైలెట్‌గా నటించాడు. యుద్ద సమయంలో ఫ్లయిట్ నడుపుతూ వెళ్లి పాకిస్తాన్ ఆర్మీకి కార్తి చిక్కుతాడు. అతడిని ఒక యుద్ద ఖైదీగా పాకిస్తాన్ పట్టుకుంటుంది.

ఇక, ఈ సినిమాకు ఐఏఎఫ్ కీలకం. అందుకే దాని గురించి సమగ్రమైన వివరాలు తెలుసుకోవడానికి మణిరత్నం సినిమా ప్రీ ప్రొడక్షన్ సమయంలో ఒక మాజీ ఎయిర్ మార్షల్‌ను కలుసుకున్నాడు. యుద్ద సమయంలో ఐఏఎఫ్ ఎలా వ్యవహరిస్తుంది.. దాని పని తీరు ఎలా ఉంటుందనే విషయాలు తెలుసుకున్నాడు. ఆ వివరాలు అందించిన ఎయిర్ మార్షల్ పేరు సింహకుట్టి వర్థమాన్. ఈయన ఎవరో కాదు నిన్న పాకిస్తాన్‌లో పట్టుబడ్డ అభినందన్ తండ్రి.

మణిరత్నం ఏనాడో ఊహించి సినిమా తీయడం.. దానికి సింహకుట్టి సహకరించడం.. రెండేళ్ల తర్వాత అతని కుమారుడు అదే విధంగా పాక్ ఆర్మీకి పట్టుబడడం అంతా విచిత్రంగా ఉందని పలువురు అంటున్నారు. నిజంగా జీవితంలో మనం ఊహించినట్లే జరిగితే.. ముఖ్యంగా అవి బాధాకరమైన విషయాలైతే ఎలా ఉంటుందో ఈ ఘటన నిరూపించింది.

First Published:  28 Feb 2019 7:09 AM IST
Next Story