Telugu Global
NEWS

టీడీపీ నాయకులకు "మహానాయకుడు" సినిమా కష్టాలు....

బాలకృష్ణ నిర్మించిన ఎన్టీఆర్ బయోపిక్‌ రెండు భాగాలు డిజాస్టర్‌గా మిగిలిపోయాయి. కనీస స్థాయిలో కూడా వసూళ్లు చేయలేకపోయాయి. బాలకృష్ణ సినీ చరిత్రలోనే దారుణమైన కలెక్షన్లు ఈ చిత్రాలవే. అయితే ఎన్నికల వేళ మహానాయకుడి సినిమాను ప్రజలకు చూపించడం ద్వారా అంతో ఇంతో మైలేజ్ పెంచుకునేందుకు టీడీపీ నాయకత్వం కష్టపడుతోంది. మహానాయకుడు సినిమాలో చంద్రబాబు పాత్రను హీరోగా చూపడం, చంద్రబాబే లేకుంటే ఎన్టీఆర్‌ లేరు అన్నట్టుగా మహానాయకుడు సినిమాలో చూపించిన నేపథ్యంలో ఈ చిత్రాన్ని జనానికి చూపిస్తే చంద్రబాబుపై […]

టీడీపీ నాయకులకు మహానాయకుడు సినిమా కష్టాలు....
X

బాలకృష్ణ నిర్మించిన ఎన్టీఆర్ బయోపిక్‌ రెండు భాగాలు డిజాస్టర్‌గా మిగిలిపోయాయి. కనీస స్థాయిలో కూడా వసూళ్లు చేయలేకపోయాయి. బాలకృష్ణ సినీ చరిత్రలోనే దారుణమైన కలెక్షన్లు ఈ చిత్రాలవే. అయితే ఎన్నికల వేళ మహానాయకుడి సినిమాను ప్రజలకు చూపించడం ద్వారా అంతో ఇంతో మైలేజ్ పెంచుకునేందుకు టీడీపీ నాయకత్వం కష్టపడుతోంది.

మహానాయకుడు సినిమాలో చంద్రబాబు పాత్రను హీరోగా చూపడం, చంద్రబాబే లేకుంటే ఎన్టీఆర్‌ లేరు అన్నట్టుగా మహానాయకుడు సినిమాలో చూపించిన నేపథ్యంలో ఈ చిత్రాన్ని జనానికి చూపిస్తే చంద్రబాబుపై ఉన్న వెన్నుపోటు ముద్ర కాస్తయినా చెరిగిపోతుందని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో మహానాయకుడు సినిమాను ప్రజలకు చూపించే బాధ్యతను టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు అప్పగించారు. నేతల ద్వారా ఉచితంగా టికెట్లను పంపిణీ చేయించి థియేటర్లకు జనాన్ని తరలించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గుంటూరు, కృష్ణా జిల్లాలలో ఫ్లెక్సీలు పెట్టి మరీ టికెట్లు ఉచితంగా ఇస్తాం మహానాయకుడు సినిమా చూడండి అంటూ టీడీపీ నేతలు ఆహ్వానాలు పలుకుతున్నారు.

గుంటూరు జిల్లాలో పరిస్థితి ఇలాగే ఉంది. ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌ల కార్యాలయాల్లో ఉచితంగా టికెట్లు పంచుతున్నారు. ఎలాగైనా థియేటర్లకు జనాన్ని తరలించేందుకు నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. పైగా ఈ సినిమా సీఎం బామ్మర్దిది కావడంతో భారం టీడీపీ నేతలు నెత్తినేసుకున్నారు. తమ డబ్బుతో టికెట్లు కొని వాటిని జనానికి ఉచితంగా పంచుతున్నారు. మీడియా కెమెరాలకు కూడా ఈ దృశ్యాలు దొరికాయి.

ఇలా చేయడం వల్ల చంద్రబాబుపై జనంలో ఉన్న వెన్నుపోటు ముద్రను చెరిపేందుకు ప్రయత్నించడంతో పాటు… బాలకృష్ణ సినిమాకు కాసుల వర్షం కాస్తయినా కురిపించినట్టు అవుతుందంటున్నారు.

First Published:  28 Feb 2019 11:06 AM IST
Next Story