రేపు అభినందన్‌ను విడుదల చేస్తాం " ప్రకటించిన ఇమ్రాన్ ఖాన్
పాకిస్తాన్ నిర్బంధంలో ఉన్న భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్‌ను రేపు(శుక్రవారం) విడుదల చేస్తామని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇవాళ పార్లమెంటులో ప్రకటించారు. శాంతి చర్యల్లో భాగంగా ఇది తమ అడుగని.. అందుకే అభినందన్‌ను విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే అభినందన్‌ను విడుదల చేయనున్నట్లు పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి మహ్మద్ షా ప్రకటించారు. ఇక రెండు నిన్న పీవోకేలో మిగ్ 21 విమానం కూలిపోవడంతో ఆ భూభాగంలో పడిన ఐఏఎఫ్ […]
పాకిస్తాన్ నిర్బంధంలో ఉన్న భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్‌ను రేపు(శుక్రవారం) విడుదల చేస్తామని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇవాళ పార్లమెంటులో ప్రకటించారు. శాంతి చర్యల్లో భాగంగా ఇది తమ అడుగని.. అందుకే అభినందన్‌ను విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు.
ఇప్పటికే అభినందన్‌ను విడుదల చేయనున్నట్లు పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి మహ్మద్ షా ప్రకటించారు. ఇక రెండు నిన్న పీవోకేలో మిగ్ 21 విమానం కూలిపోవడంతో ఆ భూభాగంలో పడిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్‌ను పాక్ ఆర్మీ అదుపులోనికి తీసుకున్న విషయం తెలిసిందే.
తనను పాక్ ఆర్మీ చాలా బాగా చూసుకుంటుందని చెబుతూనే.. ఆర్మీ అడిగిన చాలా ప్రశ్నలకు అతను సమాధానాలు చెప్పలేదు. అతని ధైర్య సాహసాలకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి. అతడు వెంటనే తిరిగి రావాలని కోరుకున్నారు.